Advertisement
Google Ads BL

విశాల్ పై విరుచుకుపడిన నిర్మాతలు


ప్రస్తుతం తమిళ చిత్రసీమలో మోస్ట్ పవర్ ఫుల్ యాక్టర్ ఎవరు అని అడిగితే.. మొదట రజనీ, అజిత్, విజయ్ అనే పేర్లు మైండ్ లోకి వచ్చినప్పటికీ, అక్కడి పరిస్థితుల గురించి తెలిసినవారు మాత్రం కాస్త ఆలోచించి విశాల్ పేరే చెబుతారు. అందుకు కారణం విశాల్ స్టార్ డమ్ లేదా అతడి సినిమాలు సాధిస్తున్న విజయం కాదు. ప్రస్తుతం తమిళ చిత్రసీమలోని కీలకమైన స్థానాల్లో విశాల్ ముందంజలో ఉన్నాడు. విశాల్ అక్కడ నడిగర్ సంఘానికి అధ్యక్షుడు మాత్రమే కాదు టి.ఎఫ్.పి.సి ప్రెసిడెంట్ కూడా. అయితే.. ఎన్నికల సమయంలో తన ప్రత్యర్ధి శరత్ కుమార్ పై గెలుపొందడం కోసం చాలా ప్రామిస్ లు చేసేశాడు విశాల్. ఇప్పుడు ఆ ప్రామిస్ లు నిలబెట్టుకోవడంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

దాంతో నిన్నమొన్నటివరకూ కాస్త ఓపిక పట్టిన నిర్మాతలందరూ ఒక్కసారిగా విశాల్ పై విరుచుకుపడ్డారు. టి.ఎఫ్.పి.సి బిల్డింగ్ ను లాక్ చేయడమే కాక విశాల్ ఆఫీస్ లో రచ్చ చేశారట. అదే సమయానికి విశాల్ ఊర్లో లేకపోవడంతో అతడి స్నేహితులను బెదిరించారని కూడా తెలుస్తోంది. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. విశాల్ పై విరుచుకుపడ్డ నిర్మాతల్లో విశాల్ ప్రాణస్నేహితుడైన ఆర్.కె.సురేష్ కూడా ఉన్నాడు. 

ఇప్పుడిప్పుడే కథానాయకుడిగా, నిర్మాతగా విశాల్ నిలదొక్కుకుంటున్న తరుణంలో ఇలా నిర్మాతల మండలి విశాల్ ను ఎదిరించడం, నడిగర్ సంఘం కూడా మెలమెల్లగా రివర్స్ అవుతుండడంతో వచ్చే ఎన్నికల్లో విశాల్ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఇదంతా చూస్తున్న శరత్ కుమార్ మాత్రం తనను చిత్తుగా ఓడించిన విశాల్ ఇప్పుడు సమస్యల సుడిగుండంలో ఇరుక్కొని బాధపడుతుండడాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడట. 

Producers Fire on Vishal:

Producers council members and nadigar sangam members are not happy with vishal and his plannings
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs