Advertisement
Google Ads BL

నా జర్నీలో ఈ ముగ్గురికీ థ్యాంక్స్: హీరో తనీష్


బాల నటుడిగా పరిచయం అయిన తనీష్ హీరోగా పదేళ్ళ మైలురాయిని దాటుతున్న సందర్భంగా  మీడియాతో ముచ్చటించారు. నచ్చావులే విడుదలయి ఈ రోజు(19.12.18) కి పదేళ్ళు పూర్తయ్యింది. నటుడిగా 20 యేళ్ళు, హీరోగా పదేళ్ళ ప్రయాణం పూర్తి అయిన తరుణంలో తన వెన్నంటి నిలిచిన మీడియాతో కాసేపు మాటలు కలిపారు తనీష్.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ.. ‘‘నాకు చిన్నప్పటి నుండి డాన్స్‌లంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చితో ఎక్కడ పాట కనపడినా వెళ్ళి డాన్స్‌లను చేసే వాడిని. మా నాన్నగారు(వర్ధన్ బాబు) డిఫెన్స్ లో పనిచేసే వారు. అక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతుండేవి. వాటిలో చాలా ఇష్టంగా పాల్గొనేవాడిని. ఆ ఇష్టం నన్ను అందరిలో ప్రత్యేకంగా నిలిపింది. బాలనటుడ్ని చేసింది. బాలనటుడిగా రోజుకి మూడు షిప్ట్‌లు చేసే వాడిని, నా కెరియర్ కోసం మా నాన్నగారు తన జీవితంలో అతి పెద్ద రిస్క్ చేసి తన జాబ్‌కి వాలెంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. తర్వాత  చాలా కష్టాలు చూసాం. కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం. కానీ నా మీద నమ్మకం, ధైర్యం ఎప్పుడూ నా తల్లిదండ్రులు కోల్పోలేదు. నచ్చావులే సినిమా టైంలో నాకు మరొక సినిమా హీరోగా ఆఫర్ వచ్చింది. కానీ ఆ కథ అంతగా నచ్చలేదు. ఆ టైం లో నచ్చావులే సినిమా ఆడిషన్స్‌కి అటెండ్ అయ్యాను. ‘దర్శకుడు రవిబాబు గారు నన్ను చూసిన వెంటనే నువ్వు తగ్గితే అప్పుడు ఆలోచిస్తా’ అన్నారు. మా నాన్నగారు ఇన్నాళ్ళు చూసాం. ఇప్పుడు వెనకడుగు వేయడం ఎందుకు అని హీరో ఆఫర్ ఇచ్చిన వారికి వద్దని చెప్పి, నచ్చావులే కోసం తగ్గడం మొదలు పెట్టాను. పదిహేను రోజుల్లో పదికేజీలు తగ్గిన తర్వాత తర్వాత రవిబాబు గారిని కలిస్తే ‘రేపు సినిమా ఓపెనింగ్ వచ్చేయ్’అన్నారు. ఆ సినిమా చేసే టైమ్‌లో ఇంజనీరింగ్ చేసే వాడిని. నేను ట్రావెల్ చేసే బస్‌లో నా పాటలు ప్లే అయ్యేవి. కానీ అవి నావని చెప్పుకోవాలని ఉన్నా చెప్పలేదు. సినిమా రిలీజ్ రోజు ప్రెండ్స్‌తో థియేటర్‌కి వెళ్ళాను. బయటికి వచ్చి చూస్తే సినిమా పెద్ద హిట్ అనే రిపోర్ట్ తెలిసింది. ఈ అవకాశం ఇచ్చిన రామోజీరావు గారికి, రవిబాబు గారికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. బాల నటుడిగా 60కి పైగా సినిమాలు, హీరోగా 20 సినిమాలు కంప్లీట్ చేసాను. 

నా ఈ జర్నీలో ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. మొదటిగా మీడియా. నా ప్రతి సందర్భంలో నా వెంట ఉంది. రెండు నా తల్లిదండ్రులు, తర్వాత ప్రేక్షకులు. ఈ ముగ్గురు నా గుడ్ అండ్ బ్యాడ్‌లో నావెంట ఉన్నారు. నా కెరియర్‌లో హిట్స్ ఉన్నాయి ప్లాప్స్ ఉన్నాయి. కానీ నా జర్నీ మాత్రం కొనసాగుతుంది.  నేను తెలియక చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. వాటిలో ఒకటి మీడియాకి దూరంగా ఉండటం. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని మీడియాతో పంచుకోవాలనిపించింది. నా ప్రతి అడుగులోనూ మీడియా నాకు సపోర్ట్ చేసింది. నా మంచి, చెడును ప్రజలముందు పెట్టింది. కెరియర్‌లో పడ్డాను, లేచాను. ఈ పదేళ్ళ జర్నీలో చాలా ఎత్తు పల్లాలు చూసాను. అవి నన్ను రాటు తేల్చాయి. నేను హీరో అనే మైండ్ సెట్‌తో ఇండస్ట్రీకి రాలేదు. అలాంటి పాత్రలు అని గిరిగీసుకోలేదు. నేను చేసిన కొన్ని సినిమాలు బాగున్నాయని టాక్ వచ్చినా.. ఆశించిన విజయం సాధించని సందర్భాలున్నాయి కానీ, అది పబ్లిసిటీ లోపమా..? సరైనా రిలీజ్ దొరకకా..? లాంటి విషయాలపై ఎవరి మీదా కంప్లైంట్స్ లేవు. బిగ్‌బాస్ నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ప్రతి ఇంటిలోకి తీసుకువెళ్ళింది. ఆ షో నాకు చాలా ఎమోషనల్ మూమెంట్స్‌ని మిగిల్చింది. రంగు తర్వాత మరో కథను ఫైనలైజ్ చేసాను. మిగిలిన వివరాలు త్వరలో అందిస్తాను. ఈ పదేళ్ళ జర్నీలో నాకు తోడుగా నా తమ్ముళ్ళు కుష్వంత్, వంశీ ఉన్నారు. అలాగే మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు..’’ అన్నారు.

Hero Tanish Latest Interview:

Hero Tanish Completes 10 years as a Hero 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs