Advertisement
Google Ads BL

‘RRR’కు రామ్ చరణ్ హీరోనే కాదు..!!


స్టార్ హీరోగా.. నిర్మాతగా రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చేయని సాహసం చేస్తున్నాడు. ఒక వైపు హీరోగా సినిమా షూటింగ్.. మరో వైపు నిర్మాతగా మరో సినిమా షూటింగ్. రెండింటినీ చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక నిర్మాతగా మారిన తర్వాత ఒక్కో సినిమా బడ్జెట్ పరిమితులుదాటకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పరిమితి దాటి బడ్జెట్ పెడితే.. సినిమా టాక్‌లో తేడా వస్తే నిర్మాతలు ఎంత బాధపడాల్సి వస్తుందో నిర్మాతగానే కాదు.. చాలామంది నిర్మాతలను రామ్ చరణ్ చూస్తున్నాడు కనుకనే తాను నటిస్తున్న సినిమాల బడ్జెట్ పరిమితి దాటిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక తాజాగా రామ్ చరణ్ నిర్ణయం చూస్తుంటే తెలివైన పర్ఫెక్ట్ నిర్ణయమనాల్సిందే.

Advertisement
CJ Advs

అదేమిటంటే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రానికి రామ్ చరణ్ హీరోగానూ... షాడో ప్రొడ్యూసర్ గాను ఉండబోతున్నాడట. అదికూడా తన పారితోషకాన్ని ఆ సినిమాలో పెట్టుబడిగా పెడుతున్నాడనే టాక్ వినబడుతుంది. కేవలం RRR పారితోషకమే కాదు.. ప్రస్తుతం తాను నటిస్తున్న వినయ విధేయ రామ పారితోషకాన్ని కూడా RRRలో పెట్టుబడి పెడుతున్నాడట. వినయ విధేయ రామకి, RRR కి నిర్మాత దానయ్య కాబట్టి.. నిర్మాతకి భారం తగ్గించడానికి రామ్ చరణ్ ఇలా షాడో పార్టనర్‌గా RRRకి పనిచేస్తున్నాడని సమాచారం.

మరి గతంలో మరో హీరో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు RRRకి పారితోషకంగా కాకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటారనే ప్రచారం జరిగింది. ఇక తాజాగా రామ్ చరణ్ తన రెండు సినిమాల పారితోషకాలను దానయ్యతో కలిసి RRRకి పెట్టుబడిగా పెట్టడమే కాదు.. లాభాల్లో వాటా కూడా అడగ్గా.. ఎలాగూ భారీ బడ్జెట్ చిత్రమైన RRRకి మరో నిర్మాత తోడు అవసరం అని భావించిన దానయ్య, రామ్ చరణ్ ప్రపోజల్‌కి వెంటనే ఒప్పేసుకున్నాడట. మరి అలా RRRకి షాడో ప్రొడ్యూసర్‌గా రామ్ చరణ్ పెట్టుబడి పెట్టి భారీ అంచనాలున్న, క్రేజున్న ఈ RRRతో భారీగా లాభపడినట్లే. అందుకే రామ్ చరణ్ పర్ఫెక్ట్ నిర్మాత అన్నది.

Ram Charan Big Role For RRR:

Ram Charan The Shadow Producer For RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs