Advertisement
Google Ads BL

ఆయన పెళ్లికి.. ఎన్టీఆర్, ప్రభాస్ హడావుడి!


దర్శక ధీరుడు రాజమౌళికి టాలీవుడ్ లో చాలామంది స్నేహితులు.. సన్నిహితులు ఉన్నారని తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళికి ఇష్టమైన వాళ్లలో ఎన్టీఆర్.. ప్రభాస్ ముందు ఉంటారు. ఏ హీరోతో అయినా చెప్పలేం కానీ వీరితో సినిమా తీయడానికి రాజమౌళి.. చేయడానికి ప్రభాస్, ఎన్టీఆర్ లు ఇద్దరూ ముందు ఉంటారు. ఈనేపధ్యంలో త్వరలోనే రాజమౌళి కొడుకు కార్తికేయ వెడ్డింగ్ జరుగనుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఈ వెడ్డింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Advertisement
CJ Advs

ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ డిన్నర్ గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహానికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో పెద్ద హీరోస్ నుండి చిన్న హీరోస్ దాకా.. 

ప్రముఖ డైరెక్టర్స్.. ప్రముఖ ప్రొడ్యూసర్స్.. ప్రముఖ హీరోయిన్స్ ఈ డిన్నర్ కి అటెండ్ అవుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ దగ్గరలో ఒక విలాసవంతమైన రిసార్ట్ లో ఈ భారీ పార్టీ ఈవారం జరగబోతున్నట్లు సమాచారం. 

వీరిని ప్రభాస్.. ఎన్టీఆర్ లు వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.  కార్తికేయ - పూజాల వెడ్డింగ్ కూడా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. డిసెంబర్ 31 న జరిగే ఈ మ్యారేజ్ కి ఇండస్ట్రీ నుండి పొలిటికల్ నుండి చాలామంది సెలెబ్రెటీస్ హాజరవనున్నారు. మరి ప్రభాస్.. ఎన్టీఆర్ లు ఇచ్చే డిన్నర్ పార్టీ ఎవరెవరు వస్తున్నారు అని ఇప్పటి నుండే ఆసక్తిగా చూస్తున్నారు అందిరి ఫ్యాన్స్. మరోపక్క వెడ్డింగ్ కోసం వేసే మండపం సెట్ గురించి రకరకాల ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ కొడుకు కాబట్టి ఆ మాత్రం క్యూరియాసిటీ ఉంటుంది.

NTR and Prabhas Arrange Party for Director Son:

Top Heroes Will Plan A Grand Party to Karthikeya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs