Advertisement
Google Ads BL

ట్యాక్సీవాలా, అమ్మడుకి లాభం జరిగిందా?


పూటకోక హీరోయిన్ పుట్టుకొస్తున్న ఈ తరుణంలో దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను మన హీరోయిన్లు కాస్త గట్టిగానే ఫాలో అవుతుంటారు. అందుకే కథ-కథనాలను పట్టించుకోకుండా సింపుల్ గా హీరో కాస్త పాపులరై.. రెమ్యూనరేషన్ ఇస్తే చాలు సినిమాలు సైన్ చేసేస్తుంటారు. కానీ.. టాక్సీవాలా సినిమాతో వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్.. ఆ సినిమా విడుదలై నెల పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ తన తదుపరి చిత్రం సైన్ చేయలేదు. ప్రస్తుతం అమ్మడు ఈవెంట్స్ చేస్తూ టైమ్ పాస్ చేస్తోంది. 

Advertisement
CJ Advs

రవితేజ సినిమాలో మూడో హీరోయిన్ రోల్ ఓకె చెప్పేసింది అనే టాక్ వచ్చినప్పటికీ.. అది కూడా ఇప్పటివరకూ ఫైనల్ అవ్వలేదు. అప్పట్లో తమిళం నుంచి ఆఫర్లు వచ్చినట్లు చెప్పిన ప్రియాంక ఇక వాటి గూర్చి కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇది సరిపోదు అన్నట్లు ఒక్క సినిమా హిట్ అవ్వగానే అమ్మడు రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందని మరో టాక్. దాంతో మీడియం బడ్జెట్ లేదా కొత్త సినిమా నిర్మాతలు ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఆమె రెమ్యూనరేషన్ చూసి భయపడుతున్నారట.ఇలా ఇప్పటివరకూ సినిమా సైన్ చేయకపోవడమే పెద్ద మైనస్ అనుకుంటే.. ఈ తరుణంలో ఇలా రెమ్యూనరేషన్ విషయంలో పెంట పెడుతుండడం ఆమె కెరీర్ కు ఏమాత్రం మంచిది. 

ఈ ఏడాది చివర్లోపు ఆమె అర్జెంట్ గా ఏదో ఒక సినిమా సైన్ చేస్తే తప్ప ఆమె ఉనికిని ఆమె కాపాడుకోవడం కష్టమే. లేదంటే.. వచ్చిన హిట్ ను సరిగా వినియోగించుకోలేకపోయిన హీరోయిన్ల ఖాతాలో ప్రియాంక జవాల్కర్ కూడా చేరుతుంది.  

What is Taxiwaala Heroine Next Project:

After the Huge Success of Taxiwaala, heroine priyana jawalkar didnt signed any project yet and demanding high remunaration 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs