Advertisement
Google Ads BL

రకుల్ పాపకి శ్రీదేవి కష్టాలు


ఎప్పుడో 9 నెలల క్రితం చనిపోయిన శ్రీదేవి కారణంగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సమస్యలు ఎదుర్కోవడం ఏంటి అనుకొంటున్నారా. నిజంగానే రకుల్ ప్రీత్ సింగ్ కి శ్రీదేవి కష్టాలొచ్చాయండీ బాబు. ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ ప్రీత్ దివంగత శ్రీదేవి పాత్రలో కనిపించనుంది. సినిమాలో ఆమెకు ఎన్ని సీన్లు ఉంటాయో తెలియదు కానీ.. ఆకు చాటు పిందె తడిసే పాటలో మాత్రం శ్రీదేవిని రీప్రెజంట్ చేస్తోంది రకుల్. అప్పట్నుంచి రకుల్ ని అందరూ శ్రీదేవితో పోల్చడం మొదలెట్టారు. పాపం రకుల్ కూడా శ్రీదేవిలా కనిపించడం కోసం నానా ఇబ్బందులు పడుతోందట. ఈ విషయమై తన స్నేహితులతో మాట్లాడుతూ.. వీళ్ళ అంచనాలను రీచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటోంది, మరీ ముఖ్యంగా బయట ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అందరూ ఆమెను శ్రీదేవితో పోల్చడం మాత్రమే కాక ఆమె వేసుకోనే దుస్తులను కూడా జడ్జ్ చేయడం మొదలెట్టారు. 

Advertisement
CJ Advs

దాంతో.. రకుల్ ఎక్కడికెళ్లినా శ్రీదేవిలా రెడీ అవ్వడం తప్పడం లేదట. ప్రస్తుతం రకుల్ కి తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ తప్ప మరో సినిమా లేకపోవడం, సైన్ చేసిన వెంకీ మామ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేకపోవడం కంటే కూడా అందరూ తనను శ్రీదేవితో కంపేర్ చేసి.. కాస్త సెక్సీగా రెడీ అయినా, హాట్ ఫోటోస్ ఏమైనా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో పెట్టినా.. ఇమ్మీడియట్ గా నువ్ ఇప్పుడు శ్రీదేవి పాత్ర పోషిస్తున్నావ్ కాస్త డీసెంట్ గా ఉండు అని కామెంట్స్ పెడుతుండడం చాలా ఇబ్బందిపెడుతోంది. 

హీరోయిన్లకు ఈ తరహా ఇబ్బందులు కొత్తేమీ కాదు. మహానటి టైమ్ లో కీర్తిసురేష్ కి, పద్మావతి టైమ్ లో దీపికాకి కూడా ఈ తరహా సంఘటనలే ఎదురయ్యాయి. మరి రకుల్ ఈ ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. 

Rakul Facing Sridevi Problems :

After Portraying sridevi in NTR Biopic, Everyone comparing Rakul with Sridevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs