Advertisement
Google Ads BL

సురేష్ బాబుకి TRS టెన్షన్


పొలిటీషియన్స్ అందరూ సినిమావాళ్లతో కాంటాక్ట్ లో ఉంటారో లేదో తెలియదు కానీ.. మన సినిమావాళ్లు మాత్రం పొలిటీషియన్స్ తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంటారు. హీరోలు సంఘంలో పరపతి కోసం రిలేషన్ మెయింటైన్ చేస్తే.. హీరోయిన్లు ఎక్స్ ట్రా కంఫర్ట్ కోసం రాజకీయ నాయకులతో స్నేహబంధం కొనసాగిస్తుంటారు. కానీ.. నిర్మాతలు మాత్రం చాలా ముందుచూపుతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు. అందులోనూ సురేష్ బాబు లాంటి బడా నిర్మాతలు ఒక రిలేషన్ కాదు కదా కనీసం ఒక ఫోన్ చేయడానికి కూడా మనకేంటి అని ఆలోచిస్తుంటారు. అలాంటి సురేష్ బాబుని టి.ఆర్.ఎస్ ప్రభుత్వం భయపెడుతోంది. అంటే.. వాళ్లేమీ రామానాయుడు స్టూడియోస్ మీదకు దండయాత్రకు రావడం లేదనుకోండి. 

Advertisement
CJ Advs

విషయం ఏంటంటే.. భారీ మెజారిటీతో టి.ఆర్.ఎస్ నాయకులు గెలిచిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి మన ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ క్యూ కట్టి మరీ అభినందనలను తెలియజేస్తున్నారు. కానీ.. రిజల్స్ట్ రోజు నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ కేటీయార్ కానీ హరీష్ రావు కానీ సురేష్ బాబు ఫోన్స్ కు రెస్పాండ్ అవ్వడం లేదట. ఇవాళైతే అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా.. దిల్ రాజుకి దొరికింది కానీ సురేష్ బాబుకి దొరకలేదంట. మరి.. సురేష్ బాబుకి టి.ఆర్.ఎస్ ప్రభుత్వంతో ఎలాంటి పని ఉందో తెలియదు కానీ కేటీఆర్ మరియు హరీష్ రావులను కలవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. 

Suresh Babu Worried About TRS Government:

KTR and Harish Rao not respong to Suresh babu phone calls 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs