Advertisement
Google Ads BL

‘వెంకీ మామ’పై ఏంటీ వార్తలు ..?


సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు నిర్మాతగా... వెంకటేష్ - నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ చిత్రం దర్శకుడు బాబీ దర్శకత్వంలో మొదలైంది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం సజావుగా సాగడం లేదనేది ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది అనుకుంటున్న ‘వెంకీ మామ’ షూటింగ్ చిత్రీకరణ అడుగడుగునా బ్రేక్ పడుతుందట. నాగ చైతన్య మొదటి షెడ్యూల్ లో పాల్గొంటున్నాడని చెప్పారు. ఇక వెంకటేష్ కూడా ‘ఎఫ్ టు’ షూటింగ్ పూర్తికాగానే వెంకీ మామ షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడని అన్నారు. అయితే రెగ్యులర్ షూటింగ్ లో జరుగుతున్నప్పటికీ... కొంత గందరగోళంతోనే షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతుందట.

Advertisement
CJ Advs

అలా ఎందుకు జరుగుతుంది అంటే... నిర్మాత సురేష్ బాబు కి ‘వెంకీ మామ’ స్క్రిప్ట్ తృప్తినివ్వడం లేదట. అసలు సినిమా మొదలవ్వకముందే సురేష్ బాబు ఈ విషయం మీద కాస్త సీరియస్ గా ఉన్నాడనే న్యూస్ నడిచింది. తాజాగా కూడా సురేష్ బాబు ‘వెంకీ మామ’ స్క్రిప్ట్ మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడట. ఏడెనిమిది సార్లు సీన్ ఆర్డ‌ర్లు, ట్రీట్‌మెంట్లూ మార్చుకుంటూ వెళ్లడం.... అయిన‌ప్ప‌టికీ సంతృప్తి క‌ల‌గ‌లేద‌నేది ఇన్సైడ్ టాక్. అసలు ఇప్ప‌టికీ స్క్రిప్టుపై సురేష్ బాబు ఆమోద ముద్ర ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. అందుకే షూటింగ్ సక్రమంగా జరగడం లేదట. సురేష్ బాబు తాను నిర్మించే సినిమాల విషయంలో మామూలుగానే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటాడు.

ఇక తన సొంత తమ్ముడు, మేనల్లుడు సినిమా కావడంతో.. ఈ ‘వెంకీ మామ’ విషయంలో మరింత ఇన్వాల్వ్ అవుతున్నాడట. అందుకే దర్శకుడు బాబీకి ఏం చెయ్యాలో పాలుపోక.. సురేష్ బాబు వైఖరికి బెంబేలెత్తుతున్నాడట.. ఇక ఏ హీరోలు తనకి దొరక్క సురేష్ బాబు చెప్పింది చెయ్యడానికి ఒప్పుకున్న బాబీ ఇప్పుడు సురేష్ బాబు చేష్టలకు విసిగిపోయి.. దర్శకుడిగా సినిమాకి హ్యాండ్ ఇచ్చినా ఇవ్వొచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి.

Director Bobby Unhappy With Producer Involvement on Venky Mama:

Doubts on Venky Mama Project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs