Advertisement
Google Ads BL

కౌశల్‌.. మరీ అంత ఎక్కువైతే కష్టం సుమీ..?


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 తో ఒక్కసారిగా టాప్ సెలబ్రిటీగా మారిపోయిన కౌశల్.. ప్రస్తుతం సీరియల్స్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బిగ్‌బాస్‌లోకి రాకముందే సీరియల్ నటుడిగా, మోడల్‌గా తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకున్న కౌశల్.. బిగ్‌బాస్ లోకొచ్చాక ఆ క్రేజ్ మరింతగా పెంచుకున్నాడు. కౌశల్‌ని కౌశల్ ఆర్మీ హీరోని చేసింది. ఇక బిగ్‌బాస్ నుండి బయటికొచ్చాక చేతినిండా సినిమాలు, పలు యాడ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కౌశల్ బిజీబిజీగా అవుతాడనుకుంటే.. అలాంటిదేం జరగలేదు. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక.. గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్‌కి తన పేరు పరిశీలనలో ఉందని, అలాగే ప్రైమ్ మినిస్టర్ నుండి కాల్ వచ్చిందని గొప్పలు పోయిన కౌశల్ చెప్పినవన్నీ అబద్ధాలని ప్రూవ్ అయ్యాయి.

Advertisement
CJ Advs

అయితే బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ బయటికొచ్చాక ఒక నెల పాటు కౌశల్ ఆర్మీని కలవడం, అలాగే కౌశల్ ఆర్మీతో మంచి పనులు చేయిస్తున్నా అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన కౌశల్ రిబ్బన్ కటింగ్స్ అంటూ హడావిడి చేసాడు. హీరో హీరోయిన్స్ తో పాటుగా తానూ షాప్ ఓపెనింగ్స్ లో రిబ్బన్స్ కట్ చేస్తూ కాస్త హడావిడి చేసాడు కూడా. బిగ్‌బాస్ క్రేజ్‌ని ఉపయోగించుకున్న కౌశల్... తనని షాప్ ఓపెనింగ్స్ కి పిలిచిన వారికీ చుక్కలు చూపెడుతున్నాడనే టాక్ వినబడుతుంది. మొదట్లో కౌశల్ కొన్ని విషయాల్లో బిగ్‌బాస్‌ని యూజ్ చేసుకున్నా.... కౌశల్ బిగ్‌బాస్ విన్నర్‌గా షాప్ కటింగ్స్‌తో క్యాష్ చేసుకుంటూ చెలరేగిపోదామనుకున్నాడు.

అందుకే తనని సంప్రదించే షాప్ యజమానులకు.. రిబ్బన్ కటింగ్ చేయాలంటే 25 లక్షలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడట. కౌశల్ చెప్పిన 25 లక్షల పారితోషకం విన్న షాప్ యజమానులు కౌశల్ కాల్ కట్ చేస్తున్నారట. మరి హీరోయిన్స్‌కి కూడా లేని డిమాండ్ తనకి వచ్చేసింది అనుకున్నాడేమో కౌశల్ అందుకే.. ఇలా అడుగుతున్నాడు కాబోలు. హీరోయిన్స్ అయితే ఐదారు లక్షలకే వచ్చేస్తుంటే.... బిగ్ బాస్ క్రేజ్ తో ఈయనకి 25 ఎక్కడ సమర్పించుకుంటాం అంటూ బెంబేలెత్తుతున్నారట షాప్ యజమానులు. 

Bigg Boss winner Kaushal Demands 25 Lakhs:

Kaushal wants 25 Laksh to Ribbon Cutting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs