ఏ భాషా నటులైనా కాస్త టైమ్ దొరికితే చాలు గోవానో, బ్యాంకాకో వెళ్లి రిలాక్స్ అవుతారు. సినిమా వాళ్ళకి బ్యాంకాక్ ఎంత ఫేమస్సో.. గోవా కూడా అంతే ఫేమస్. అక్కడ బీచ్ ఒడ్డున ఆడుతూ పాడుతూ టైం తెలీయకుండా ఎంజాయ్ చేస్తుంటారు. సినిమా వాళ్ళే కాదు ఇప్పుడు యూత్ కూడా చాలామంది గోవా వెళ్లి మసాజ్‌లు, బీచ్ ఒడ్డున కేరింతలు కొడుతూ సేద తీరుతున్నారు. మొన్నీమధ్యనే సింగర్స్ బ్యాచ్ చాలామంది ఫ్యామిలీస్‌తో సహా గోవా వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌లో యంగ్ హీరోస్ గోవా పయనమవుతున్నారట. అక్కడ జరగబోయే ఒక పార్టీ కోసం ఈ యంగ్ హీరోస్ మొత్తం గోవాకి పోతున్నారట.
అక్కడ గోవాలో జరగబోయే పార్టీకి నాని, నితిన్, మెగా హీరో వరుణ్ తేజ్, హీరో సాయిధరమ్ తేజ్, హీరో శర్వానంద్‌లతో పాటుగా డైరక్టర్స్ వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్, హరీష్ శంకర్ కూడా హాజరవుతారనేది లేటెస్ట్ న్యూస్. అయితే ఎవరి సినిమా షూటింగ్స్‌లో వారు బిజీగా వున్నారు కానీ....ఒక పెళ్లి పార్టీ కోసం ఈ యంగ్ హీరోస్ అండ్ డైరక్టర్స్ మొత్తం గోవాకి చెక్కేస్తున్నారట. మరి గోవాలో పెళ్లి చేసుకోబోయేది ఏ హీరోనో అనుకునేరు. హీరో కాదు దిల్ రాజు అన్న కొడుకు పెళ్లిని దిల్ రాజు గోవాలో ప్లాన్ చేశాడట. ఈ నెల 21న జరగబోయే హర్షిత్ వివాహానికి ఈ హీరోలు, డైరెక్టర్స్ గోవా వెళుతున్నారట.
మరి అక్కడ గోవాలో గతంలో నాగ చైతన్య - సమంత పెళ్లి వేడుకలు ఏ రేంజ్ లో జరిగాయో తెలిసిన సంగతే. ఇక తాజాగా దిల్ రాజు కూడా ఒక రేంజ్ లో తన అన్న కొడుకు పెళ్లిని గోవాలో ప్లాన్ చేశాడట. మరి ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరోస్ మొత్తం పెళ్లి, బ్యాచిలర్ పార్టీలో బీచ్ ఒడ్డున అదరగొట్టేస్తారన్నమాట.