కింగ్ అక్కినేని నాగార్జున రెండు సినిమాలతో మన ముందుకు రానున్నాడు. అందులో ఒకటి సీక్వెల్ ..ఇంకోటి ప్రీక్వెల్. నాగ్ నటన.. త్రివిక్రమ్ మాటలు.. విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ ‘మన్మధుడు’ కి సీక్వెల్ రానుంది. మన్మధుడు 2కి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాని రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేయనున్నాడు. అలానే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ పార్ట్ 2 కి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
‘సోగ్గాడే చిన్ని నాయనా’ కు ముందు జరిగిన కథ ఇప్పుడు పార్ట్ 2 గా తెరకెక్కించనున్నారు. ఇందులో మరో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో నాగ చైతన్య ఓ కిక్కిచ్చే పాత్ర చేస్తునట్టు సమాచారం. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో బంగార్రాజుకు ఒకే కొడుకు ఉన్నట్టు చూపించారుగా. ఇప్పుడు తీయబోయే ప్రీక్వెల్ లో బంగార్రాజు చిన్న కొడుకుగా చైతును చూపించనున్నారు. ప్రస్తుతం చైతు పాత్రను చాలా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ.
ఈ వార్త విన్న అక్కినేని ఫ్యాన్స్ మామూలు ఆనందం పొందట్లేదు. అసలే ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి అసలు కలిసి రాలేదు. ముఖ్యంగా నాగ్ చేసిన ‘దేవదాస్’ చిత్రం నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. చైతు చేసిన ‘సవ్యసాచి’...‘శైలజా రెడ్డి అల్లుడు’ రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. అఖిల్ నుండి ఒక్క సినిమా కూడా ఈ ఏడాదిలో రాలేదు. సుమంత్ నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ కొంచెం పర్లేదు అనిపించుకుంది కానీ వసూల్ రావడంలేదు. సో అలా అక్కినేని ఫ్యామిలీకి ఈ ఏడాది కలిసి రాలేదు. దాంతో ఎలా అయినా వచ్చే ఏడాది బలమైన సబ్జెక్టులతో బౌన్స్ బ్యాక్ కావాలని నాగ్ గట్టి ప్రణాళికే వేస్తున్నాడు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగ్. అందుకే ఈ స్టోరీ రెడీ అవ్వడానికి ఇంత టైం పడుతుంది. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి..