Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ బయోపిక్‌నే టార్గెట్ చేస్తున్నారుగా..?


టాలీవుడ్‌లో మహానటి బయోపిక్ సక్సెస్ అవడంతో వరసబెట్టి అనేక బయోపిక్స్ ని ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. అందులో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్న బయోపిక్స్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటైతే మరొకటి వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’. ఈ రెండు సినిమాల మీద రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లోనూ... ఎన్టీఆర్, వైఎస్సార్ అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా కథానాయకుడు, మహానాయకుడుగా తెరకెక్కిస్తున్నాడు. ఇక యాత్ర కూడా త్వరగానే చిత్రీకరణ జరుపుకుంది. అలాగే వైఎస్సార్ బయోపిక్ 2O19 ఎన్నికల టార్గెట్‌గా వైఎస్సార్సీపీ‌కి అనుకూలంగా తెరకెక్కుతుంది. అయితే యాత్ర సినిమా రేపు వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 21 నే విడుదలకావాల్సి ఉండగా.. యాత్ర నిర్మాతలు యాత్ర సినిమాని పోస్ట్ పోన్ చేశారు.

Advertisement
CJ Advs

మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న యాత్ర సినిమాని యాత్ర నిర్మాతలు ఎందుకు పోస్ట్ పోన్ చేసారంటే... ఎన్టీఆర్ బయోపిక్ మీద పోటీకి విడుదల చేయడానికి పోస్ట్ చేశారనే వార్తలు తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణలు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడిని చాలా చాకచక్యంగా 2019  సంక్రాంతికి విడుదలకు లాక్  చేయగా... మహానాయకుడుని జనవరి 24 న విడుదల చేస్తామని చెప్పారు. అయితే మహానాయకుడు జనవరి 24 నుండి పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరి రెండో వారానికి వెళుతుందని ప్రచారం జరిగినప్పుడు... యాత్రని సంక్రాంతి బరిలో వదలకుండా ఫిబ్రవరి రెండో వారంలోనే మహానాయకుడు మీద కి దింపే ప్లాన్ చేశారట యాత్ర నిర్మాతలు. 

అయితే తాజాగా మహానాయకుడుని ఫిబ్రవరి 7 న విడుదల చేస్తున్నామంటూ ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలు డేట్ లాక్ చేసేసరికి యాత్ర నిర్మాతలు కూడా యాత్ర సినిమాని ఫిబ్రవరి 8న దించబోతున్నామని అఫీషియల్‌గా విడుదల తేదీని ప్రకటించారు. మరి యాత్ర సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా... ఎన్టీఆర్ బయోపిక్ మీద పోటీకి దింపే యోచనలోనే యాత్ర నిర్మాతలు ఉండేసరికి యాత్ర డేట్ మారుతూ వచ్చిందట.  ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర రెండు ఒకేసారి బరిలో దిగితే ఏ నిర్మాతది పై చెయ్యి అవుతుందో... అలాగే ఎన్టీఆర్ హీరో అవుతాడో, రాజశేఖర రెడ్డి హీరో అవుతాడో అప్పుడు ప్రేక్షకులే తెలుస్తారన్నమాట.

Biopic War between NTR And YSR:

NTR And YSR Biopic Release Dates Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs