Advertisement
Google Ads BL

ఎఎమ్‌బినీ నిత్యం వార్తల్లో ఉంచుతున్న నమ్రత!!


అనాథ పిల్లల కోసం ఎ ఎం బి సినిమాస్ స్పైడర్ మాన్ స్పెషల్ షో

Advertisement
CJ Advs

సూపర్ స్టార్ మహేష్, నమ్రతల ఔదార్యం గురించి తెలిసిందే. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. తమ సంపాదనలో కొంత భాగం ఛారిటీకి కేటాయిస్తూ అనాథ పిల్లలకి చేయూత అందిస్తుంటారు. అత్యాధునిక హంగులతో ప్రారంభమైన తమ కొత్త మల్టీప్లెక్స్ ఎఎమ్‌బి సినిమాస్‌లో స్పైడర్ మాన్ ఇన్ టూ ద స్పైడర్ వెర్సే చిత్రం విడుదలకు ముందే ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని, సోనీ పిక్చర్స్ ఇండియా సంయుక్తంగా అనాథ పిల్లల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

స్పైడర్ మాన్ ఇన్ టూ ద స్పైడర్ వెర్సే చిత్రం శుక్రవారం విడుదలైంది. 150 మందికి పైగా పిల్లలు ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ ని వీక్షించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఎఎమ్‌బి సినిమాస్‌లో ఈ చిత్రాన్ని 3D లో చూడటం గొప్ప అనుభూతిని ఇచ్చిందని పిల్లలు తమ సంతోషం పంచుకున్నారు. నమ్రత చిన్నారులతో ప్రత్యేకంగా సమయం గడిపి వారితో కలిసి కబుర్లు చెప్పటం వారికి మరింత ఆనందాన్నిచ్చిందట. పలువురు మీడియా ప్రతినిధులు కూడా తమ కుటుంబంతో ఈ ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు.

Namratha Spends Time for Orphans at AMB Cinemas:

SpiderMan Into the Spider Verse Special show for Orphans at AMB Cinemas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs