Advertisement
Google Ads BL

ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడతా: శర్వా!


శర్వానంద్ , సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ అవుతుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మురళీ శర్మ, సునీల్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం యొక్క  ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేయగా, చిత్రబృందం హాజరయ్యారు.

Advertisement
CJ Advs

హీరో సునీల్ మాట్లాడుతూ.. ఈ సినిమా 21 న రిలీజ్ అవుతుంది. తప్పకుండా యూత్ ని అలరిస్తుంది. రెండున్నర గంటల పాటు అందర్నీ అలరించే మంచి లవ్ ఎంటర్ టైనర్ ఇది. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని , శర్వా కి మరో మంచి హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి బాగా డబ్బు రావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.  

నటుడు శత్రు మాట్లాడుతూ.. కృష్ణగాడి వీర ప్రేమగాధ నుంచి హను గారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాలో నాది చిన్న పాత్ర. కానీ డిఫరెంట్ పాత్ర. సినిమా మంచి హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు.

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. పడి పడి లేచె మనసు తప్పకుండా అందరికి నచ్చుతుంది. ఆ క్రెడిట్ శర్వానంద్ కి దక్కుతుంది. చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమా కూడా అలరిస్తుంది. అందరూ చాలా కష్టపడి సినిమా చేశారు.. అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సాంగ్స్, టీజర్ చూస్తుంటే సినిమా చాలా బాగా వచ్చిందనిపిస్తుంది. ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త నిర్మాతలు వస్తుంటారు కానీ కొంతమందే సక్సెస్ అవుతారు అలాంటి వారిలో ఈ సినిమా నిర్మాత సుధాకర్ అనిపిస్తుంది. హను ఫస్ట్ సినిమా అందాల రాక్షసి ఎందుకు హిట్ అవ్వలేదో తెలీదు కానీ మణిరత్నం గారి టేకింగ్ ఆయన సినిమాల్లో కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడి పనిచేశారని విన్నాను. ఈ సినిమాకి మంచి హీరోయిన్ దొరికింది.  శర్వానంద్ తో నాకు మంచి అటాచ్ మెంట్ ఉంది. శతమానంభవతి సినిమాతో ఇంకా మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాపై మంచి ఇంట్రెస్ట్ ఉండే హీరో అతను.  శర్వా, సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. సినిమా గురించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతా. టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫంక్షన్ కి వచ్చి సినిమాను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్.. అన్నారు.

Padi Padi Leche Manasu Trailer Release Event Highlights:

Padi Padi Leche Manasu Trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs