Advertisement
Google Ads BL

రాముడి కోసం కేటీఆర్ వస్తున్నాడంట!


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘వినయ విధేయ రామ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది ఒక్క సాంగ్ తప్ప. ఈ రోజు (డిసెంబర్ 14) నుండి ఆ సాంగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరగనుంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ నటి ఇషా గుప్తా స్టెప్ లు వేయనుంది.

Advertisement
CJ Advs

ఇది ఇలా ఉండగా ఈచిత్రం యొక్క ఆడియో లాంచ్ 24 కానీ 27 తేదీల్లో ఏదొక రోజు హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్స్‌గా రాజమౌళి..యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా వస్తారు అని ఫిలింనగర్ సమాచారం. అలానే ఈ ఈవెంట్‌కు ఇటీవల జరిగిన రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన కేటీఆర్ కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రానున్నారట. 

రామ్‌చరణ్ - కేటీఆర్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. సో చరణ్ కోసం కేటీఆర్ వస్తాడని అంటున్నారు. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమా యొక్క ప్రీ బిజినెస్ ఒక రేంజ్‌లో జరిగింది. జనవరి 11వ తేదీన విడుదల అవుతున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది.

KTR chief guest to Mega Power Star Ram Charan Movie Audio Function:

KTR, Rajamouli, Jr NTR Chief Guests to VVR Audio
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs