Advertisement
Google Ads BL

‘అంతరిక్షం’కు కష్టాలు స్టార్ట్స్..!!


క్రిష్ నిర్మాణ సారథ్యంలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, అదితిరావులు జంటగా ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్ సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. అభిరుచి గల దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని నిర్మించడం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే... జాతీయ అవార్డు గ్రహీత సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని జీరో గ్రావిటీలో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెట‌ప్‌లో చిత్రీకరించడం. హాలీవుడ్ తరహా గ్రాఫిక్స్‌తో అత్యున్న‌త సాంకేతిక విభాగం ఈ సినిమా కోసం పనిచేసింది. తాజాగా విడుదలైన అంతరిక్షం ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

Advertisement
CJ Advs

అయితే విడుదలకు మరొక వారం టైం ఉన్న ఈ సినిమా బిజినెస్ విషయంలో ఒక ఊహించని ట్విస్ట్ జరిగిందని ఫిలింనగర్ సాక్షిగా గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పటివరకు వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమా బిజినెస్ బాగా జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా అంతరిక్షం ఆంధ్రా హక్కులు కొనుగోలు చేసిన అర్జున్ అనే డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు అంతరిక్షం ఆంధ్రా హక్కులను వదిలేశాడనే టాక్ ఫిలింనగర్ లో జోరుగా వినబడుతుంది. మరి ఏడు కోట్ల డీల్ కి సై అన్న అర్జున్ ఇప్పుడు ఇలా ఉన్నట్టుండి ఎందుకు తప్పుకున్నాడా అనేది మాత్రం తెలియడం లేదు. అర్జున్ తప్పుకోవడంతో.. ఇప్పుడు అంతరిక్షం నిర్మాతలు మరో డిస్ట్రిబ్యూటర్‌తో అంతరిక్షం ఆంధ్రా హక్కుల డీల్ నడుపుతున్నట్లుగా సమాచారం.

మరి ఉన్నట్టుండి ఒక డిస్ట్రిబ్యూటర్ వెనక్కి వెళ్లడంతో ఆ ఎఫెక్ట్ మిగతా అంతరిక్షం బిజినెస్ మీద పడుతుందని నిర్మాతలు వర్రీ అవుతున్నారట. మరి ఈ విషయం బయటికి పొక్కకుండా అంతరిక్షం ఆంధ్రా డీల్ సెట్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారట. మరోపక్క సినిమా విడుదలకి మరొక వారం టైం మాత్రమే ఉండడంతో... ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలవ్వడంతో... చిత్ర టీం మొత్తం కాస్త కంగారులో ఉన్నట్లుగా తెలుస్తుంది.

Problems Starts to Varun Tej Anthariksham Movie:

Andhra Distributor Jhalak to Anthariksham Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs