Advertisement
Google Ads BL

భానుమ‌తి న‌క్స‌లైట్ అవ‌తారం!


భానుమ‌తి ఒక్క‌టే పీస్‌.. హైబ్రీడ్ పిల్ల .. రెండు కులాలు.. రెండు మ‌తాలు..అంటూ `ఫిదా` సినిమాతో  తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న‌దైన న‌ట‌న‌తో మంత్ర ముగ్థ‌ల్ని చేసింది త‌మిళ సోయ‌గం సాయి ప‌ల్ల‌వి. మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల్ని మ‌ల‌ర్‌గా మైమ‌రిపించిన అమెకు తెలుగులో క్రేజ్ మామూలుగా లేదు.  ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి రూపొందిస్తున్నరొమాంటిక్ ల‌వ్ స్టోరీ `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` చిత్రంలో న‌టిస్తోంది. బెంగాలీ భామ‌గా క‌నిపించ‌నున్న‌ సాయి ప‌ల్ల‌వి త్వ‌ర‌లో ఓ తెలుగు చిత్రంలో న‌క్స‌లైట్ గా త‌న‌దైన శైలిలో విజృభించి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌బోతోంద‌ని తెలిసింది. 

Advertisement
CJ Advs

`ఫిదా`లో భానుమ‌తిగా త‌న‌దైన శైలి న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సాయి ప‌ల్ల‌వి త్వ‌ర‌లో `నీది నాది ఒకు క‌థ` ఫేమ్ వేణు ఊడుగుల రూపొందించ‌నున్న చిత్రంలో స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలిసింది. ఈ చిత్రంలో ఆమె  న‌క్స‌లైట్‌గా అల‌రించ‌నునంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో టాలీవుడ్ హంక్ రానా హీరోగా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో  న‌టించ‌నున్నాడు. ఒక పోలీస్ ఆఫీస‌ర్‌కి, ఓ న‌క్స‌లైట్‌కి మ‌ధ్య జ‌రిగే ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల కొత్త పంథాలో రూపొందించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. `ఫిదా` త‌ర‌హాలోనే తెలంగాణ అమ్మాయిగా సాయి ప‌ల్ల‌వి ఈ చిత్రంలో క‌నిపించ‌నుంద‌ని, ఆమె పాత్ర మ‌రోసారి టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అవ‌డం ఖాయం అని చిత్ర బృందం చెబుతోంది. 

Sai Pallavi turns naxalite:

Sai Pallavi turns naxalite
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs