Advertisement
Google Ads BL

రామ్ చరణ్ రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు..!


మాస్ లో నేనే కింగ్ అని నిరూపించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ఏడాది వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో నాన్ ‘బాహుబలి’ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసి మాస్ లో తన పవర్ ఏంటో నిరూపించాడు చరణ్. ప్రస్తుతం చరణ్ - బోయపాటి డైరెక్షన్ లో ‘వినయ విధేయ రామా’ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఇందులో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

టైటిల్ అందుకే ఫ్యామిలీస్ ని ఎట్రాక్ట్ చేసేలా కనిపిస్తుంది. ‘రంగస్థలం’ రేంజ్ లో ఇది అందరిని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు అంతా. ఇప్పటికే ఈ సినిమాకి హిందీ డబ్బింగ్ - శాటిలైట్ రూపంలో  22కోట్ల డీల్ పూర్తయిందంటూ ప్రచారం సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ కాంపిటీషన్ నడుమ 5.6 కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం. అక్కడ ‘రంగస్థలం’ సినిమాను 4.2 కోట్లకు రైట్స్ కొనుక్కుంటే 6.35కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో 24కోట్ల రేంజ్ బిజినెస్ చేస్తున్నారన్న సమాచారం అందింది.

కృష్ణ.. గుంటూరులో సైతం ఈ సినిమా యొక్క రైట్స్ కోసం ఎగపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గుంటూరులో ఈ సినిమాను సీ- డీ కేంద్రాల హక్కుల కోసమే 1.6 కోట్లు వెచ్చించి జయరామ్ అనే పంపిణీదారుడు దక్కించుకున్నట్టు సమాచారం. ఓవర్సీస్ లోను ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. జనవరి 11 న ఈ సినిమాతో పాటు జనవరి 10 న ‘ఎన్టీఆర్’ బయోపిక్...వెంకీ - వరుణ్ ల ‘ఎఫ్ 2’ సినిమా 12 న..రజిని ‘పెట్టా’...అజిత్ ‘విశ్వాసం’ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి.

Vinaya Vidheya Rama Hot Cake:

Ram Charan Range Revealed with Vinaya Vidheya Rama Business
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs