Advertisement
Google Ads BL

2018 టాప్ 3 హీరోయిన్స్ వీళ్ళే


తెలుగు ఇండస్ట్రీ అనే కాదు ఏ ఒక్క ఇండస్ట్రీలోనూ హీరోలకి ఉన్నంత లైఫ్ స్పాన్ హీరోయిన్స్ కి ఉండదు. ఒక ఏడాది ఏకంగా పది సినిమాలు సైన్ చేసిన హీరోయిన్ మరో ఏడాది కేవలం రెండు సినిమాలే చేయొచ్చు. ఎంత అద్భుతమైన ఫామ్ లో ఉన్న హీరోయిన్ అయినా మరో కొత్త భామ ఎంట్రీ ఇవ్వగానే సైడ్ అయిపోవాల్సిందే. అలాంటి హీరోయిన్ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించడమే కష్టం అనుకుంటే.. మంచి కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకోవడం ఇంకా కష్టమైన పని. ఆ కష్టమైన పనిని అత్యంత నేర్పుతో పూర్తి చేసి ఈ ఏడాది బెస్ట్ హీరోయిన్స్ గా నిలిచారు సమంత, రష్మికా మండన్నా, కీర్తి సురేష్. 

Advertisement
CJ Advs

ఈ ముగ్గురు హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ కేవలం తన నటన మరియు హావభావాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. సమంతకి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ రావడమే కాదు.. తన కెరీర్ బెస్ట్ మూవీస్ చేసింది. ఇక కీర్తి సురేష్ పేరు మహానటిగా మారిపోయింది కూడా ఈ సంవత్సరమే. ఇక లక్కీయస్ట్ గర్ల్ రష్మిక మండన్న గీతగోవిందం, దేవదాస్ చిత్రాలతో మంచి విజయాలు అందుకోవడమే కాదు టాలీవుడ్ ని తన మెయిన్ బేస్ గా మార్చేసుకుందీ కన్నడ సుందరి. అందుకే.. ఈ ముగ్గురు కథానాయికలు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా నిలిచారు. 

మరి ఈ పొజిషన్ ను ఇకపై కూడా కంటిన్యూ చేస్తారా లేక కొట్టమ్మాయిలకు ఛాన్స్ ఇస్తారా అనేది వారి భవిష్యత్ ప్రణాళికలు, ఎంచుకునే చిత్రాల మీద ఆధారపడి ఉంటుంది అనుకోండి. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళే 2018 టాప్ మరియు బెస్ట్ హీరోయిన్స్.

Top 3 heroines of TFI:

Samantha, Rashmika, Keerthi Suresh Gains the top 3 positions of TFI
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs