Advertisement
Google Ads BL

తోడళ్లుల్లు పండక్కి నవ్విస్తారు.. అంతేగా?


అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా.. వెంకటేష్ - వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 .. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ హంగామా మొదలైపోయింది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఈ మూవీ హడావిడి మాములుగా స్టార్ట్ కాలేదు. ఎఫ్ 2 టీజర్ తో గ్రాండ్ గా మొదలు పెట్టేశారు. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా కనిపించబోతున్నారు. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో సంక్రాంతి కానుకగా విడుదలకాబోతుంది. ఇక ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీజర్ లోకి వెళితే.. వెంకటేష్ క్యారెక్టర్ బోలెడన్ని నవ్వులు పూయించేస్తుంది. పెళ్ళికి ముందు పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకుంటామని చెప్పే మగవాళ్ళు పెళ్లి తర్వాత పెళ్ళాం పెట్టే టార్చర్ కి ఎంత ఫ్రస్టేషన్ లో ఉంటారో ఈ టీజర్ లో కామెడీ తో కలిపి చూపించారు.

Advertisement
CJ Advs

వెంకటేష్ కూడా పెళ్ళికి ముందు పెళ్లి గురించి మరోసారి ఆలోచించమంటే... పెళ్లయ్యాక పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలో తెలుసంటూ.. పెళ్లి చేసుకుని తమన్నా చేతిలో బలైపోవడమే కాదు.. వెంకీ చెప్పే ఫన్నీ డైలాగ్స్ నవ్వించేస్తున్నాయి. ఇక వరుణ్ తేజ్ కూడా తెలంగాణా రాక ముందు.. వ‌చ్చిన త‌ర‌వాత‌ అంటూ చెప్పబోతుంటే వెంకీ మధ్యలో అడ్డుపడి ఇప్పుడవన్నీ అవసరమా భయ్యా అంటూ చెప్పడం.. వరుణ్ కూడా పెళ్లయ్యాక పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలో మాకు తెలుసు బ్రో అంటూ చెప్పే తెలంగాణ యాస డైలాగ్స్ అబ్బబ్బ కడుపుబ్బా నవ్వించేస్తున్నాయి సుమీ. అనిల్ రావిపూడి అంటేనే కామెడీ. కామెడీ అంటేనే అనిల్ రావిపూడి అన్నట్లుగా ఉంటాయి అనిల్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు. మరి పండక్కి తోడల్లుళ్లు కామెడీ చూడడానికి రెడీ అవడం కాదు.. తోడల్లుళ్లిద్దరు కలిసి సినిమాని ఎప్పుడు చూపిస్తారా అనే తొందర ఎక్కువైంది ఎఫ్ 2 టీజర్ చూశాక. 

Click here for F2 teaser:

F2 Teaser Review:

F2 Fun and Frustration Teaser Review    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs