Advertisement
Google Ads BL

సరైన్ హిట్ ఒక్కటీ లేదు.. అయినా రిచ్చే..!!


తన మొదటి సినిమాతోనే భారీగా లాంచ్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే. తన ప్రతీ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అయిపోవడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ పర్లేదు అనిపించుకున్నా.. ఆ తరువాత నుండి వసూల్ బాగా డల్ అయిపోతున్నాయి. గత వారం రిలీజ్ అయిన ‘కవచం’ పరిస్థితి కూడా అంతే. మొదటి రోజు ఓపెనింగ్స్ పర్లేదు అనిపించుకున్నా.. రెండు రోజు నుండి వీకెండ్స్‌లో వసూళ్లు పడిపోయాయి.

Advertisement
CJ Advs

‘అల్లుడు శ్రీను’, ‘జయ జానకి నాయక’ సినిమాలు పర్లేదు అనిపించుకున్నప్పటికీ.. బడ్జెట్లు ఎక్కువ అయిపోవడంతో ఫెయిల్యూర్లుగానే నిలిచాయి. ఆ తరువాత వచ్చిన ‘సాక్ష్యం’  గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన ‘కవచం’ బడ్జెట్ తక్కువ అయినప్పటికీ కాస్టింగ్..ప్రొడక్షన్ వేల్యూస్ చూస్తే బాగానే ఖర్చు పెట్టినట్లుగా కనిపించింది. సో ఈ సినిమాకి కూడా కనపడని బడ్జెట్ అయింది.

సినిమాలు ఆడకపోతున్నప్పటికీ శ్రీనివాస్‌పై ఇంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారో అర్ధం కావట్లేదు. తన మార్కెట్ తెలిసి కూడా మన ప్రొడ్యూసర్స్ ఓవర్ బడ్జెట్.. ఓవర్ కాస్టింగ్ ఎందుకు చేస్తున్నారో అర్ధం అవ్వట్లేదు. సినిమా రిలీజ్ అయిన తరువాత లాస్ వచ్చినా ఎవ్వరూ నష్టాల గురించి కనీసం బాధపడటం కూడా కనిపించదు. మరి మన ప్రొడ్యూసర్స్ ఇతనిపై ఎందుకు ఇంతలా ఖర్చు పెడుతున్నారు అంటే...ఈ నిర్మాతలు కొంత మేర ఖర్చు పెట్టుకుంటే.. కొంత బెల్లంకొండ సురేష్ సమకూరుస్తాడని.. బిజినెస్, ప్రమోషన్, రిలీజ్.. ఈ బాధ్యతలన్నీ ఆయనే చూసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్.

ఇవ్వని బెల్లంకొండ సురేష్ చూసుకుంటున్నా.. మిగిలిన తమ వాటాగా ఎంత తక్కువ ఖర్చు పెట్టుకున్నా కూడా  వర్కవుట్ కావట్లేదట. అతడితో సినిమా చేస్తే అసలు మిగలకపోవడంతో..వెనక్కి తగ్గుతున్నారు ప్రొడ్యూసర్స్. ప్రస్తుతానికి అయితే శ్రీనివాస్ చేతిలో ఒక సినిమా ఉంది. ఈసినిమా తరువాత ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్‌తో సినిమా చేసే పరిస్థితులు లేవు. పోనీ తన తండ్రి డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేద్దాం అంటే ఫైనాన్స్ సమస్యల వల్ల అలా చేయలేడు. మరి ఏమి చేస్తారో చూడాలి. మనోడికి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువట. సినిమాకి 3 - 4 కోట్లు వరకు తీసుకుంటున్నాడని సమాచారం.

Young Hero Future in Danger Zone :

Bellamkonda Srinivas Future in Doubt
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs