Advertisement
Google Ads BL

గెలవకముందు సెలైన్స్.. గెలిచాక ఇలానా?


డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ ఘన విజయం సాధించింది. భారీ మెజారిటీతో తెరాస తిరుగులేని విజయం సాధించింది. అయితే గెలుపు ఎవరి వెంట ఉంటే వారి దగ్గరే ఉండే మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్నడూ లేని విధంగా ఈసారి మన సినీ స్టార్స్ సోషల్ మీడియాలో తెరాస కు అభినందనలతో కొంచెం అతి చేశారు. రెండేళ్ల ముందువరకు అంటి ముట్టనట్టుగా ఉండే మనోళ్లకు ఒకేసారి ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో?

Advertisement
CJ Advs

వాస్తవానికి 2014 ఎన్నికల తరువాత  ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం.. ఏ అవసరం వచ్చినా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లేవారు. ఆయనతో అన్ని పరీక్షరించుకునే వాళ్ళు. ఏ సమస్య ఉన్నా ఆయనతోనే చెప్పుకునే వాళ్ళు. కానీ తెరాస లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి మొత్తం హెచ్చరికలే జారీ చేశారు. తెలంగాణాలో ఉండి ఆంధ్రా సీఎంను కలిసేదేంటి? చంద్రబాబు వద్దకు వెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరించారట. సో అప్పటి నుండి ఆ భయంతో అంతా తెలంగాణ ప్రభుత్వ పెద్దల దగ్గరకే వెళ్లడం ప్రారంభించారని టాక్.

ముఖ్యంగా డ్రగ్స్ కేసు విషయం అప్పుడు టాలీవుడ్ నుండి చాలామంది కేటీఆర్‌ని కలిశారు. ఇండస్ట్రీ మొత్తం ఒక ఊపు ఊపేసిన డ్రగ్స్ కేసు చాలా రోజుల తరువాత చల్లబడింది. మరి తెర వెనుక ఏమి జరిగిందో తెలియదు కానీ అప్పుడు నుండి మంత్రి కేటీఆర్ తో రెగ్యులర్ టచ్‌లో ఉండటం.. ఆడియో ఫంక్షన్స్‌కి పిలవడం వంటివి స్టార్ట్ చేశారు మనోళ్లు. నాగార్జున లాంటి సీనియర్ యాక్టర్ సైతం తెరాస జపం చేయటం స్టార్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత నాగార్జునకు సంబంధించిన కొన్ని ల్యాండ్స్‌కు సంబంధించి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్లే నాగార్జున తెరాస జపం స్టార్ట్ చేశాడనే టాక్ అప్పట్లో నడిచింది. మరి అంత క్లోజ్ గా ఉన్న మన స్టార్స్ తెరాస ఎలక్షన్స్ వచ్చేసరికి ముఖం చాటేశారు. ఒక్కరు అంటే ఒక్కరు కూడా వచ్చి ప్రచారం చేయలేదు. కానీ సోషల్ మీడియాలో స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అని. ఇవి తప్ప ఏమి చేయలేదు. కానీ గెలిచిన తరువాత అందరూ వరుసగా.. అభినందనలు చెప్పడం ప్రారంభించారు. మరి ఇదేమి సంస్కృతో అర్ధం కావట్లేదు.

Tollywood Stars Over Action Revealed with TS Elections:

Celebrities wishes to TRS Party Winner KCR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs