Advertisement
Google Ads BL

2018 తెలంగాణ ఎలక్షన్ ఫైనల్ రిజల్ట్!!


గత ఎన్నికల్లో తెలంగాణ ట్యాగ్ మీద గెలిచింది అని అనిపించుకున్న టీఆర్‌ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థులను స్పషమైన మెజార్టీతో మట్టికరిపించింది. గత ఎన్నికల్లో బొటాబొటి సీట్స్ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న టీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో స్వీప్ చేసేసింది. నాలుగైదు రాజకీయ పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్ మీద దండెత్తాయి. కానీ టీఆర్ ఎస్ ని ఏమి చేయలేకపోయాయి. కాంగ్రెస్ కి నాయకత్వ లోపం ఎంతెలా ఉందో ఈ ఎన్నికల్లో మరోసారి రుజువైంది. కాంగ్రెస్ గెలిస్తే ఐదారుగురు అభ్యర్థులు సీఎం రేసులో ఉన్నారు. ఆ సీఎం రేస్ అన్నవారు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

Advertisement
CJ Advs

కాంగ్రెస్ సీనియర్ నాయకులూ మొత్తం ఓటమి పాలయ్యారు. కనీసం గౌరవప్రదమైన ప్రతిపక్షాన్ని కూడా కాంగ్రెస్ ఏర్పాటు చెయ్యలేని స్థితికి దిగజారింది. ఇక ఈ 2018 తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబమైనా కేటీఆర్, హరీష్ రావు లు భారీ మెజారిటీతో ప్రత్యర్థులపై గెలుపొందారు. మరి తెలంగాణా ఎన్నికల్లో జయకేతనం ఎగరేసిన టీఆర్‌ఎస్ కి ఎన్ని సీట్లొచ్చాయి, కాంగ్రెస్ మిత్ర పక్షాలు, బిజెపి, ఎంఐఎం, ఇండిపెండెన్స్ కి ఎన్ని సీట్స్ వచ్చాయో మీరే చూడండి.

 

మొత్తం 119 స్థానాలకు గానూ.. టీఆర్‌ఎస్ ‌88 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 19, టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎంఐఎం 7, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలుపొందారు.

This is The Final Result of Telangana Elections:

TRS Wins Majority Seats in Telangana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs