Advertisement
Google Ads BL

‘ప్రేమ‌క‌థాచిత్రమ్ 2’ అప్పుడే భయపెట్టేస్తోంది!!


‘ప్రేమ‌క‌థాచిత్రమ్ 2’ హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ కోటి న‌ల‌భై మూడు ల‌క్ష‌లు

Advertisement
CJ Advs

ప్రేమకథాచిత్రమ్ తో ట్రెండ్ ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . ఈ చిత్రంతో హ‌రికిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిధ్ధి  ఇద్నాని జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కోటి 43 ల‌క్ష‌లకు శాటిలైట్ హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ను ద‌క్కించుకుంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది.  ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ ‘ప్రేమ‌క‌థాచిత్రమ్ 2’ సినిమా మొద‌టిలుక్ ని విడుద‌ల చేసుకుంది. సినిమా షూటింగ్ పూర్త‌యింది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా న‌ట‌న సూయ‌ర్ ప్ల‌స్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికి తెలుసు. అదే హ‌వాని ట్రేడ్ లో సీక్వెల్ గా వ‌స్తున్న ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 కూడా అదే క్రేజ్ తో దూసుకుపోతుంది. హింది శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ ని కోటి న‌ల‌భై మూడు ల‌క్ష‌ల‌కి కొనుగోలు చేశారు. ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిధ్ధి ఇద్నాని మ‌రో హీరోయిన్ గా చేస్తున్నారు.  విద్యుల్లేఖ, ప్ర‌భాస్ శ్రీను ల మ‌ధ్య వ‌చ్చే కామెడి ఆకట్టుకుంటుంది. జ‌న‌వ‌రిలో విడుదల కానున్న ఈ చిత్రం యెక్క టీజ‌ర్ ని అతి త్వ‌ర‌లో విడుదల చేస్తాము. పూర్తి స‌ర్‌ప్రైజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న మా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

Premakatha Chitram Satellite Rights Sold Out:

Huge price to Premakatha Chitram Satellite and Dubbing Rights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs