తెలంగాణ ఎన్నికల్లో ఎక్కువగా అందరి దృష్టి కూకట్‌పల్లి నియోజక వర్గం మీదే ఉంది. అక్కడ దివంగత హరికృష్ణ కూతురు సుహాసిని ప్రజాకూటమి తరుపున పోటీ చేసింది. బాలయ్య బాబు.. అన్న కూతురు సుహాసినిని దగ్గరుండి నామినేషన్ వేయించడం, ఆమె కోసం ప్రచారం చేయడం, చంద్రబాబు కూడా ప్రచారానికి రావడంతో... అందరూ అక్క కోసం తమ్ముళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కూడా ప్రచారం చేస్తే ఆమె గెలుపు ఖాయమన్నారు. చివరి నిమిషం వరకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు అక్క కోసం ప్రచారం చేస్తారనుకున్నారు. కానీ వారు మాత్రం కదలనే లేదు. నిజంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అక్క కోసం ప్రచారానికి వచ్చి ఉంటే.. కేటీఆర్‌కి, కేసీఆర్ కి వ్యతిరేకులయ్యేవారు. ఎందుకంటే తెలంగాణాలో టీఆర్ఎస్ క్లిన్ స్వీప్ చేసింది.
అందరూ.. తమ్ముళ్లు కనీసం ప్రచారం చేయడానికి రాలేదని అన్నప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు పట్టించుకోలేదు. ఇక తాజా ఎన్నికల్లో కూకట్‌పల్లి లో సుహాసిని ఘోరమైన తేడాతో ఓటమి పాలయ్యింది. బాబాయ్ బాలయ్య, మావయ్య చంద్రబాబు, తమ్ముడు తారకరత్న ప్రచారాలు, హరికృష్ణ మరణం కూడా సుహాసినిని విజయతీరానికి చేర్చలేకపోయింది. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు అక్క గెలవాలని కోరుకున్నారు. అలాగే తమ సపోర్ట్ అక్కకే అంటూ సోషల్ మీడియాలో చెప్పారు కానీ.. అక్క కోసం కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎవరెన్ని ప్రెస్ మీట్స్ పెట్టినా టీఆర్ఎస్ ముందు అన్ని బలాదూరే అయ్యేవి.
తెలంగాణాలో ఓటర్ల నాడిని ఎవరు అంచనా వేయలేరు అనుకున్నారు. కానీ తెలంగాణ ఓటర్లు మొత్తం ముందే టీఆర్ఎస్‌కి ముందే ఫిక్సయిపోవడంతో.. తెలంగాణాలో టీఆర్ఎస్‌కి భారీ మెజారిటీ వచ్చింది. మరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తెలివిగా అక్క కోసం ప్రచారం చేయకుండా తెలివైన పనిచేశారు. ఒకవేళ ప్రచారానికి వస్తే టీఆర్ఎస్‌కు వ్యతిరేకులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అనే ముద్ర పడిపోయేది.