Advertisement
Google Ads BL

ప్రియదర్శి అనుకుంటే రాహుల్ చేసేస్తున్నాడు!


విజయ్ దేవరకొండ‌తో నటించిన ఇద్దరు కమెడియన్స్ ఇప్పుడు సినిమాల్లో తమదైన స్టయిల్‌తో దూసుకుపోతున్నారు. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాలో విజయ్ కి ఫ్రెండ్ గా నటించిన కమెడియన్ ప్రియదర్శి... ఆ సినిమాలో నా చావు నేను చేస్తా అంటూ అందరిని కడుపుబ్బా నవ్వించడం.. తదుపరి దర్శకుల దృష్టిలో పడడం జరిగింది. పెళ్లి చూపులు తర్వాత కథల ఎంపికలో క్లారిటీ లేని ప్రియదర్శి.. అనేక సినిమాల్లో కూరలో కరివేపాకు పాత్రలే చేసాడు. పెద్ద స్టార్స్ సినిమాల్లో కమెడియన్ గా చక్రం తిప్పుదామనుకున్నాడు. అందుకే జై లవ కుశ, స్పైడర్ సినిమాల్లో తన పాత్రలకు ప్రాధాన్యం లేకపోయినా ఒప్పుకున్నాడు. ఇక ప్రియదర్శి కామెడీ ఒక్క పెళ్లి చూపుల్లో తప్ప మరెందులోనూ ఆకట్టుకోలేదు.

Advertisement
CJ Advs

ఇక విజయ్ దేవరకొండ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయిన మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణ తనదైన స్టయిల్లో కమెడియన్ గా సినిమాల్లో దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ పక్కనే ఉండే ఫ్రెండ్ గా, కమెడియన్ గా ఆకట్టుకోవడమే కాదు.. నిన్నగాక మొన్న విజయ్ దేవరకొండ గీత గోవిందం లోను కామెడీతో రెచ్చిపోయాడు. అందుకే రాహుల్ రామకృష్ణ కి మంచి మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. తాజాగా రాహుల్ రామకృష్ణ కి రాజమౌళి RRR లో కమెడియన్ అవకాశం తలుపుతట్టింది. రాహుల్ కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించాడు. అయితే RRR లో రామకృష్ణ కమెడియన్ గా చేస్తున్నాడా లేదంటే మరేదన్నా పాత్ర చేస్తున్నాడా.. అనే విషయం మాత్రం బయటపెట్టలేదు. మరి విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్ అయిన ప్రియదర్శి అలా అయితే.. రాహుల్ రామకృష్ణ ఇలా ఉన్నాడన్న మాట. 

Comedian Got Chance in RRR:

Priyadarsi vs Rahul Rama Krishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs