Advertisement
Google Ads BL

అక్కడ బాహుబలిని 2.O బీట్ చేసింది


రజినీకాంత్ 2.ఓ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసినంత సేపు లేదు 2.ఓ థియేటర్స్‌లో దిగడం.. యావరేజ్ టాక్ తెచ్చుకోవడానికి. అసలు 2.ఓ సినిమానే దర్శకధీరుడు రాజమౌళి తీసిన సినిమాని బాహుబలిని తలదన్నే సినిమాగా అభివర్ణించడం, బాహుబలి మూవీకి పోటీగా 2.ఓ నే నిలుస్తుందని... 2.ఓ విడుదలయ్యేవరకు గట్టిగా ప్రచారం జరిగింది. కానీ 2.ఓ విడుదలయ్యాక బాహుబలి కొట్టే సీన్ లేదని తేలిపోయింది. 2.ఓ గురువారం విడుదలవడంతో ఫస్ట్ వీకెండ్ హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తో నడిచినా.... సోమవారం నుండి 2.ఓ కలెక్షన్స్ అన్నిచోట్లా డ్రాప్ అయ్యాయి. ఒక్క హిందీలో తప్ప. 

Advertisement
CJ Advs

బాలీవుడ్ లో 2.ఓ విడుదలైన నాటినుండి సినిమా మంచి కలెక్షన్స్ తోనే దూసుకుపోతుంది. అక్కడ పదిరోజుల్లోనే 150 కోట్లు కొల్లగొట్టి... బ్రేక్ ఈవెన్ కి చేరుకోగా.. తాజాగా తెలంగాణ నైజాం లోను 2.ఓ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళనాట మాత్రం 2.ఓ బయ్యర్స్ కి కష్టలు తప్పవనే న్యూస్ గతవారమే స్ప్రెడ్ అయ్యింది. అక్కడ బ్రేక్ ఈవెన్ కి రావడం దేవుడెరుగు... చివరికి పెట్టిన పెట్టుబడిలో సగం వచ్చినా చాలు అనేలా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హిందీ, తెలంగాణ, ఓవర్సీస్ లో 2.ఓ హవా సాగినట్టుగా తాజాగా తమిళనాట చెన్నై లోను 2.ఓ కలెక్షన్స్ అదురుతున్నాయి. చెన్నై లో 2.ఓ చిత్రం దాదాపుగా 19 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 ని దాటేసింది.

మరి ఇంతకుముందున్న భరత్ అనే నేను, బాహుబలి, సర్కార్ ఇలా చాలా సినిమాల రికార్డుని 2.ఓ నామరూపాలు లేకుండా చెరిపేయబోతుంది. ఇక ప్రస్తుతం 19 కోట్లు గ్రాస్ దాటినా 2.ఓ లాంగ్ రన్ లో 25 కోట్లు వసూలు చేసి హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని.. ప్రస్తుతం 2.ఓ చెన్నై రికార్డులను తలదన్నాలంటే మళ్ళీ ఏ బాహుబలి లాంటి మూవీ నో రావాలంటున్నారు. మరి ఎక్కడా బాహుబలిని మట్టికరిపించలేకపోయిన 2.ఓ చెన్నైలో మాత్రం మట్టికరిపించిందనే చెప్పాలి. 2.ఓ ఫస్ట్ వీకెండ్ లో దూసుకుపోయింది. అన్ని భాషల్లోనూ రెండో వారంలో మంచి సినిమాలు లేకపోవడంతో.. 2.ఓ రెండో వారంలో పుంజుకుని కలెక్షన్స్ పెంచుకుంది.

2.O beats Baahubali at That place :

2.O Beats Baahubali at Chennai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs