Advertisement
Google Ads BL

తెలంగాణలో కూడా టాప్‌లోనే ఉంది..!!


రజినీకాంత్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ సినిమా నవంబర్ 29 న విడుదలైంది. మొదటి షో కే యావరేజ్ టాక్ తెచ్చుకుంది ప్రేక్షకుల నుండి. కానీ రివ్యూ రైటర్స్ మాత్రం 2.ఓ ని బాగా లేపారు. శంకర్ వీఎఫెక్స్ కి పడిపోయారు క్రిటిక్స్. కానీ 2.ఓ లో కథ లేకపోవడం మైనస్. అయితే రజినీకాంత్ కన్నా ఎక్కువగా ఈ సినిమాలో విలన్ రోల్ పోషించిన అక్షయ్ కి ఎక్కువ ఆదరణ దక్కింది. అక్షయ్ మేకప్, అక్షయ్ కష్టము స్క్రీన్ మీద అడుగడుగునా కనబడింది. ఇకపోతే 2.ఓ సినిమా నెగెటివ్ టాక్ వలన బయ్యర్లు నష్టపోతారని... భారీ లాస్ అవుతారని... టాక్ మాములుగా స్ప్రెడ్ అవలేదు.

Advertisement
CJ Advs

మరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే ఎవ్వరైనా అదే మాట అంటారు. కాకపోతే 2.ఓ బాలీవుడ్ లో మాత్రం అక్షయ్ కుమార్ క్రేజ్ కారణంగా మొదటి పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి చేరుకొని రికార్డు సృష్టించింది. ఇక తాజాగా తెలంగాణలోనూ 2.ఓ హవా కొనసాగుతుంది. డే వన్ నుండి నైజాంలో 2.ఓ కలెక్షన్స్ బావున్నాయి... ఇక ఇప్పటికి 2.ఓ అదే హవా కొనసాగిస్తుంది. కారణం మొన్న శుక్రవారం విడుదలైన సినిమాలలో పస లేకపోవడం ఒక కారణం అయితే... తెలంగాణాలో వరసగా సెలవలు రావడం మరో కారణం. కేవలం 10 రోజుల్లోనే  2.ఓ 20 కోట్ల మార్కు దాటి ఇక్కడ తెలంగాణలో ఇరవై కోట్ల షేర్‌ తెచ్చుకున్న సినిమాగా 2.ఓ చరిత్ర సృష్టించింది.

మరి మరో రెండు రోజుల్లో ఇదే వసూళ్ల పర్వం కొనసాగితే తెలంగాణాలో 2.ఓ బ్రేక్ ఈవెన్ రావడం ఖాయంగానే కనబడుతుంది. మరి నెగెటివ్ టాక్ తో ఇలా రెండు కోట్ల 2.ఓ కలెక్షన్స్ రావడం చూస్తుంటే... 2.ఓ గ్రాఫిక్స్ కి ప్రేక్షకులు ఎంతెలా కనెక్ట్ అయ్యారో అర్ధమవుతుంది. ఇక 2.ఓ కి మిగతా ఏరియాల్లో, మిగతా భాషల్లో నష్టాలూ తప్పేలా లేదు. ఇక హిందీలో కూడా 2.ఓ రెండో వారంలో కూడా స్టడి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. గత శుక్రవారం విడుదలైన సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ల కేదార్‌నాథ్‌ కి అక్కడ నెగెటివ్ టాక్ రావడం 2 .ఓ కి కలిసొచ్చింది.

Super Star Movie Top in Telangana:

Not only Bollywood.. 2.O also top in Telangana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs