Advertisement
Google Ads BL

మేం ఈ డైరెక్టర్‌ని ఫాలో అయితే చాలు: సుక్కు


మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 KMPH’.. డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా సినిమా విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకుడు.. దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  నిర్మిస్తున్నారు.  కాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైద్రాబాద్ లో AMB సినిమాస్ లో ఘనంగా జరిగింది.. కాగా ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నిర్మాతలు క్రిష్ , రాజీవ్ లి అద్భుతాలు సృష్టిస్తున్నారు. మంచి ప్రయత్నం చేశారు.. కొత్తదనం తెచ్చే సంకల్ప్ లాంటి డైరెక్టర్ లు ఇంకా ఇంకా ఇండస్ట్రీకి రావాలి. ఇలాంటి డైరెక్టర్ కి మంచి స్వాగతం పలుకుతున్నాను. మీడియా వారు ఇలాంటి సినిమాలను మరింత ప్రోత్సహించి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సహయపడాలి. వరుణ్ మా ఫ్యామిలీలో ఒక డైమండ్.. అందరూ వరుస సినిమాలు చేస్తాం కానీ వరుణ్ ఎంచుకుని మరీ మంచి సినిమాలు చేస్తాడు. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రయత్నం చేయడం నిజంగా అద్భుతం. ఘాజీ లాంటి సినిమా తర్వాత సంకల్ప్ ఎలాంటి సినిమా చేస్తాడు అనుకున్నాను కానీ అంతరిక్షంపై సినిమా చేయడం గొప్ప విషయం. 1500 సీజీ షాట్స్ ఉన్న సినిమాను ఇంత త్వరగా రిలీజ్ చేయడం గ్రేట్. మేమంతా నిన్ను ఫాలో అవ్వాలి. సంకల్ప్ లా ఉంటే ఎంత పెద్ద సినిమా అయినా చేయొచ్చు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. 

హీరోయిన్ అదితి రావు హైదరి మాట్లాడుతూ.. తెలుగులో నాకు ఇది రెండో సినిమా.  ఇక్కడి వాతావరణం పీపుల్స్ నాకు చాలా బాగా నచ్చారు. ఒక మంచి రోజు రాబోతుంది. ఈ సినిమాకు ఎవరు ఎంత పనిచేసినా మాతో ఇలాంటి సినిమాలు చేయిస్తున్న ఆడియెన్స్ కి ధన్యవాదాలు. వరుణ్ తో చాలా కంఫర్ట్ గా వర్క్ చేశాను.. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు..

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ మూవీలో పార్వతి పాత్ర చేస్తున్నాను. ఇలాంటి గొప్ప సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందం గొప్పగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నన్ను చూజ్ చేసిన సంకల్ప్ గారికి, ప్రొడ్యూసర్స్ రాజీవ్, క్రిష్ గారికి చాలా థాంక్స్. వరుణ్ తో నాకు రెండో సినిమా. చాలా హ్యాపీగా ఉంది. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్ సంకల్ప్ మాట్లాడుతూ.. డిసెంబర్ 21 న సినిమా రాబోతుంది. అందరూ డేట్ మార్క్ చేసుకోండి. ఇలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది. సినిమాలో 1500 సీజీ షాట్స్ ఉన్నాయి. అందరూ ముంబాయ్ లో  చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సినిమా చూసి అందరూ అమేజింగ్ గా ఫీల్ అవుతారు. ఘాజీ కన్నా ఎక్కువ ప్రెజర్ ఈ సినిమాలో ఉంది. సినిమా బాగా వచ్చేలా ప్రయత్నం చేశాం. అందరూ తప్పకుండా ఆదరించాలని అన్నారు.

నిర్మాత క్రిష్ మాట్లాడుతూ..  ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన సుకుమార్ గారికి, అల్లు అరవింద్ గారికి చాలా థాంక్స్. ఈ కథను నమ్మి సినిమా చేసిన హీరో వరుణ్ కి వెరీ థాంక్స్. ఈ సినిమా హిట్ తాలూకు క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది.. ఈ సినిమాలో నాపేరు ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన అందరి వర్క్ చూసిన తర్వాత మంచి అనుభూతి కలిగింది. ఇలాంటి వెరైటీ కథలు ఒప్పుకుని వరుణ్ ఇంకా మంచి సినిమాలు చేయాలన్నారు.

హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి చాలా థాంక్స్. సినిమా ట్రైలర్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. రిలీజ్ తర్వాత సినిమా గురించి మాట్లాడుతాను. అందరం చాలా కష్టపడి ఒక డిఫరెంట్ సినిమా చేశాం.  ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది. అన్నారు.

Sukumar praises anthariksham Director:

Anthariksham Movie Trailer Launch highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs