Advertisement
Google Ads BL

బాలయ్యను చూసి వణికిపోతున్నారట!


సినిమా ఇండస్ట్రీలో అభిమానులతో గాని, తోటి టెక్నీషియన్స్ తో కానీ ఎవరితోనైనా ఫ్రెండ్లిగానే ఉండాలి. లేదంటే మీడియా చేతికి దొరికితే ఇక అంతే. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుమీద కోపం ఉన్న హీరో ఒకరున్నారు. ఆయనే బాలకృష్ణ సెట్ లో కానీ, బయట గాని బాలయ్యకి కోపమొస్తే అభిమానులే కాదు.. సెట్ లో ఎవరిమీదనైనా చెయ్యి చేసుకునే అలవాటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని బాలయ్య బాబు మీడియాకి చాలాసార్లు దొరికేశాడు. అయినా వెర్రి అభిమానులు మాత్రం బాలయ్యని అభిమానించడం మానరు. ఏదో కోపంలో చెయ్యి చేసుకున్నాడని సర్దుకుపోతారు.

Advertisement
CJ Advs

ఇక గత ఏడాది జై సింహా సెట్ లో బాలకృష్ణ మేక‌ప్ మేన్‌ని కొట్టిన విషయం మీడియా కథలు కథలుగా ప్రసారం చేసింది. అయితే తాజాగా బాలయ్య తెలంగాణా ఎన్నికల ప్రచారంలోనూ, ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లోను బాగా బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ సెట్ లో బాలయ్య బాబుకి కోపం వస్తుందని..  ఎన్టీఆర్ బయోపిక్ సెట్ లో ఉగ్ర‌రూపం చూపిస్తున్నాడ‌ని టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. బాలయ్య కోపానికి రోజుకొకరు సెట్స్ లో ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. మరి ఎన్నికల ప్రచారం, సినిమా షూటింగ్స్ తో ఒత్తిడికి గురైన బాలయ్య ఇలా చేస్తున్నాడంటున్నారు.

గత సినిమాల సెట్స్ లోను బాలకృష్ణ కోపంతో రుసరుసలాడినా... ప్రస్తుతం ఎన్టీఆర్ సెట్స్ లో జరిగినంతగా ఎప్పుడూ లేదని...బాలకృష్ణ ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో తెలియక సెట్ లో పనిచేసేవారు ఒణికిపోతున్నారట. మరి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను పరిగెత్తిస్తూ షూటింగ్ కంప్లీట్ చేసిన బాలయ్య.. ఎన్నికల ప్రచారంలోనూ అంతే జోరు చూపించాడు. మరి షూటింగ్ స్పాట్ లో ఎనర్జీగా జోరు చూపిస్తే ఓకే కానీ.. మనుషుల మీద చూపిస్తే పద్దతిగా ఉండదు మరి. బాలయ్య ఈ నిజం ఎప్పుడు తెలుసుకుంటాడో పాపం.

Balayya serious in NTR Sets:

NTR team feared with Balayya steps
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs