మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ని కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ ప్రభాస్.. చిరు కోసం వెనక్కి తగ్గి తన సినిమాను ఆగస్ట్ 15కు వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు మరో విషయంలో కూడా ప్రభాస్‌కు పోటీగా నిలిచాడు చిరంజీవి.
అది కూడా శాటిలైట్ హక్కుల విషయంలో. ప్రభాస్ సినిమా ‘సాహో’.. చిరు ‘సైరా’ సినిమా రెండు ఒకే రేట్స్ చెప్పడంతో ప్రభాస్ సినిమాకి బదులు చిరంజీవి సినిమానే కొనుక్కుంటాం కదా... అని అంటున్నారట టీవీ ఛానెల్స్ వారు. దాంతో ‘సాహో’ మేకర్స్ కి చిరు తలనొప్పిగా మారాడు.
ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి తెలుగు శాటిలైట్ రైట్స్‌ను 25-30 కోట్ల మధ్య అమ్మాలని చూస్తున్నారు యూవీ క్రియేషన్స్ వారు. ఇదే రేట్‌ను నిర్మాత రామ్ చరణ్ కూడా ‘సైరా’కి కోట్ చేస్తున్నాడట. దీంతో టీవీ ఛానెల్స్ వారు.. చిరు సినిమానే కొనుక్కోవడానికి ఇష్ట పడుతున్నారట. లేకపోతే ‘సాహో’ మేకర్స్ ఈచిత్రాన్ని తక్కువ రేట్ కి అమ్ముకోవాలి. ‘సైరా’కు డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడు అయ్యాయి. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కోసం చూస్తున్నాడు చరణ్. త్వరలోనే శాటిలైట్ రైట్స్ కూడా అమ్మేసిందుకు అన్నీ రెడీ చేశాడు కూడా. ఇక సైరా అప్‌డేట్‌కు వస్తే.. ఈనెలాఖరు నుంచి మైసూర్ ప్యాలెస్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.