Advertisement
Google Ads BL

2019 సంక్రాంతికి బాక్సాఫీస్‌కి పండగే..!


వచ్చే సంక్రాంతికి సినిమాల హవా అప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ మూడు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి. డేట్స్ కూడా ప్రకటించేశారు. మరో రెండు సినిమాలు డేట్స్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. లిస్ట్ లో మరో 2 సినిమాలు కూడా చేరే ఛాన్స్ ఉంది. సంక్రాంతి పండగకి తెలుగు రాష్ట్రాల్లో సెలవలు కావడంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు చాలామంది దర్శకనిర్మాతలు ఈ సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.

Advertisement
CJ Advs

సంక్రాంతికి ముందుగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ తొలి పార్ట్ రానుంది. బాలయ్య లీడ్ రోల్ లో నటిస్తున్న ఈసినిమా జనవరి 9న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా షూటింగ్ మరో 10 రోజుల్లో ముగియనుంది.

‘ఎన్టీఆర్’ బయోపిక్ వచ్చిన రెండు రోజుల తరువాత రామ్ చరణ్ - బోయపాటిల సినిమా ‘వినయ విధేయ రామ’ జనవరి 11న విడుదల కానుంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘వినయ విధేయ రామ’ వచ్చిన తర్వాత రోజు అంటే జనవరి 12 న దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్ - వరుణ్ తేజ్ లు నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్-2’ విడుదల అవుతుంది. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూడింటితో పాటు లిస్ట్ లోకి మరో రెండు సినిమాలు చేరే అవకాశం ఉంది. తమిళ డబ్ మూవీస్ కూడా ఒకటి రెండు రిలీజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. సో ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదంట..

2019 Sankranthi Release movies list:

3 movies Release Dates Fixed for Sankranthi list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs