Advertisement
Google Ads BL

ఓటేసిన ఈ సెలబ్రిటీల ముఖచిత్రాలు చూశారా?


శుక్రవారం తెలంగాణ ఎన్నికల సందర్భంగా సెలబ్రిటీస్ కూడా సామాన్యుల వలే క్యూ లైన్స్ లో నిలబడి మరీ తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నారు. ఒకరిద్దరు తప్ప మిగతా స్టార్స్ మొత్తంగా తమ ఓటును వెయ్యడమే కాదు.. సామాన్య ప్రజలను కూడా ఓటు వేయాలంటూ ఉత్సాహ పరిచారు. ఇక టాలీవుడ్‌కి ప్రస్తుతం పెద్దన్నలాంటి చిరంజీవి దగ్గర నుండి... జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ తమ తమ ఫ్యామిలీస్‌తో సహా ఈ పోలింగ్‌లో పార్టిసిపేట్ చేశారు. ఇక అలా బయటికొచ్చిన స్టార్ హీరోల లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరంజీవి సై రాలో నటిస్తుంటే... ఎన్టీఆర్, రాజమౌళి మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఇక నాగార్జున బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర‌లో నటిస్తున్నాడు. మహేష్ మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఆ సినిమాల్లో ఆయా హీరోల లుక్స్ ఎలా ఉంటాయో క్లారిటీ లేదుగాని.. ప్రస్తుతం హీరోలలో చాలామంది గెడ్డం లుక్స్ తోనే నిన్న ఓటింగ్ లో పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

నాగార్జున అయితే కాస్త స్టైలిష్ గా గెడ్డం లుక్ లో కనబడితే... చిరంజీవి మాత్రం రఫ్ గా గెడ్డం లుక్ లో కనబడ్డాడు. మరి సై రా నరసింహారెడ్డి కోసం చిరు ఈ లుక్ ఎప్పటినుండో మెయింటింగ్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా భారీ బడ్జెట్ చిత్రం రాజమౌళి మల్టీస్టారర్ షూటింగ్ లో మొదటి షెడ్యూల్ లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఆ సినిమాలో ఎలా ఉంటుందో క్లారిటీ లేదుగాని.. ప్రస్తుతం గెడ్డం‌తో కనబడుతున్నాడు. భార్య లక్ష్మి ప్రణతి, తల్లితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్.... రఫ్ గెడ్డం లుక్ చూసి RRR లుక్ ఇదేనేమో అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. 

మరోపక్క భల్లాల దేవుడు రానా కూడా రఫ్ గా గెడ్డం పెంచేసి కనిపిస్తున్నాడు. అలాగే జగ్గూభాయ్ జగపతి బాబు కూడా తెల్లటి గెడ్డంలో కనిపించాడు. రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి క్లీన్ షేవ్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మహర్షిలో కొద్దిగా గెడ్డం పెంచి మాసివ్ లుక్ లో ఉన్న మహేష్ ఈ ఓటింగ్ డే రోజున మాత్రం క్లీన్ షేవ్ తో కనబడ్డాడు. ప్రస్తుతం నెక్స్ట్ సినిమాలేమీ ప్రకటించకుండా కూల్ గా ఉన్న అల్లు అర్జున్ కూల్ గా క్లీన్ కాదు కానీ... కొద్దిగా గెడ్డం అంటే ఈ రోజు షేవ్ చేసుకోలేదా అన్నట్టుగా దర్శనమిచ్చాడు. ప్రస్తుతం నిన్నఓటింగ్ కి హాజరైన హీరోల లుక్స్ లో ఈ గెడ్డం లుక్స్ జనాలను బాగా ఆకర్షిస్తున్నాయి.

Celebriteis Cast their Votes in TS Elections:

Heroes Look on Their acted movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs