Advertisement
Google Ads BL

ఆ ఘనత క్రిష్ కి మాత్రమే సాధ్యమైంది!


ప్రస్తుతం మన తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రేస్టేజియస్ ప్రొజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్. నందమూరి తారకరామారావుగా ఆయన తనయుడు బాలకృష్ణ నటించడం మాత్రం అందుకు కారణం కాదు.. ఎన్నడూలేని విధంగా లెక్కపెట్టలేనంత మంది సీనియర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు, దర్శకులు ఈ చిత్రంలో నటీనటులుగా మెరవనుండడమే అందుకు ముఖ్య కారణం. ఆల్రెడీ హన్సిక, పాయల్ రాజ్ పుత్, రకుల్ ప్రీత్ సింగ్, విద్యాబాలన్, మాళవిక నాయర్, షాలిని పాండే, అనుష్క, నిత్యామీనన్ వంటి హీరోయిన్స్ అందరూ ఈ చిత్రంలో భాగస్వాములవ్వగా.. కొందరు స్టార్ హీరోలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

Advertisement
CJ Advs

క్రిష్ ఇక్కడ ఒక కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నాడు. ఎన్టీఆర్ సినీ జీవితంలో కీలకపాత్రలు పోషించిన కొన్ని నిజజీవిత పాత్రలను సదరు పాత్రధారుల తనయుల చేత పోషింపజేయడం ఇక్కడ విశేషం. హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రామ్ పోషిస్తున్నట్లుగా.. ఎన్టీయార్ తో అత్యధిక చిత్రాలు చేసిన దర్శకుడిగా చరిత్రలో నిలిచిన కె.రాఘవేంద్రరావు పాత్రలో ఆయన కుమారుడు ప్రకాష్ కనిపించనున్నాడు. ఆల్రెడీ చిత్రీకరణ కూడా పూర్తైపోయిందట. 

ఇంతమంది తారలు, ఇన్ని ప్రత్యేకతలతో జనవరిలో విడుదలకానున్న ఎన్టీఆర్ బయోపిక్ నిజంగానే కన్నులపండుగలా ఉంటుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవారిలోనే రెండు భాగాలను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు నిర్మాతలు. 

Only Krish can do such things :

Prakash Kovelamudi to don his fathers role in NTR Biopic 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs