Advertisement
Google Ads BL

2.Oకి అసలు హీరో ఎవరో ఇప్పుడు చెప్పండి?


రజినీకాంత్ - శంకర్ కాంబోలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 2.ఓ విడుదలై అప్పుడే వారమైంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 10000 స్క్రీన్స్‌కి పైగా విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళంలో బ్రేక్ ఈవెన్ సాధించడం మాట అలా ఉంచి... అమ్మిన దానిలో సగం కూడా వచ్చేలా కనబడటం లేదు. ఈ సినిమాలో రజినీకాంత్ హీరో అనేకన్నా అందులో విలన్ గా నటించిన అక్షయ్ పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమాలో అక్షయ్ పాత్రని మనం నెగెటివ్‌గా తీసుకోలేం. ఎందుకంటే సెల్ ఫోన్స్ వలన రేడియేషన్ పెరిగి పక్షులు చనిపోవడంతోనే అక్షయ్ పక్షిరాజాగా నెగెటివ్ శక్తిగా ఎదుగుతాడు. కేవలం సెల్ ఫోన్స్ వాడే వారికి మాత్రమే శత్రువయ్యాడు కానీ.... మిగతా విషయాల్లో అక్షయ్ పాత్ర చాలా పాజిటివ్ గానే ఉంది.

Advertisement
CJ Advs

అందుకే అక్షయ్ పాత్రకి హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. హిందీ‌లో హీరోగా రికార్డుల సినిమాల్లో నటించిన అక్షయ్ కుమార్ ఇలా సౌత్ సినిమాలో విలన్ అవతారమెత్తినా... 2.ఓ లో అక్షయ్ కుమార్ మేకప్, ఆయన అవతారాలు, పక్షి రాజా అవతారం కానివ్వండి.. ఫుట్ బాల్ స్టేడియంలో పక్షి అవతారం అన్ని బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే తెలుగు, తమిళంలో సత్తా చాటలేకపోయిన 2.ఓ సినిమా బాలీవుడ్‌లో మాత్రం అదరగొట్టే కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. వీకెండ్స్ లోనే కాదు.. వీక్ డేస్ లోను 2.ఓ బాలీవుడ్‌లో సత్తా చాటుతుంది. 2.ఓ వారం తిరిగేసరికి  హిందీ వెర్షన్ వసూళ్లు 123 కోట్లకు చేరుకున్నాయి. అక్కడ త్వరలోనే 2.0 బ్రేక్ ఈవెన్‌కు చేరుకోనుంది.

మరి ఇలా హిందీ వెర్షన్ మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించడానికి కారణం మాత్రం అక్షయ్ కుమార్ స్టామీనానే అంటున్నారు. అక్షయ్ కున్న ఫాలోయింగ్, అలాగే అక్షయ్ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడం వల్లే 2.ఓ అక్కడ సత్తా చాటింది అని అంటున్నారు. మరి 2.ఓ హిందీలో కలెక్షన్స్ ఆ రేంజ్‌లో రావడానికి రజినీ మ్యానియా మాత్ర పనిచేయలేదు.. కేవలం అక్షయ కుమార్ వల్లే అని ఇప్పుడంతా అంటుండటం విశేషం.

Rajinikanth Not Hero in 2.O movie :

2.O Safe Project in Hindi Version
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs