Advertisement
Google Ads BL

అలిగి వెళ్లలేదు.. కావాలంటే చూడండి: దర్శకేంద్రుడు


శుక్రవారం, డిసెంబర్ 7న తెలంగాణ అంతా ఎలక్షన్స్ హడావుడి తలపిస్తుంటే... ఒక్క హైదరాబాద్‌లోనే సెలెబ్రిటీస్ అంతా పోలింగ్ బూత్స్ లో నిలబడి మరీ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూ.. ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోమని ఫ్రీ గా పబ్లిసిటీ చేస్తూ ఓటర్లని చైతన్యవంతులను చేస్తున్నారు. చిన్న, పెద్ద.. ఇలా సెలబ్రిటీస్ అందరూ అంతా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా అందరూ తమ తమ భార్యలతో కలిసి వచ్చి మరీ తమ పోలింగ్ కేంద్రాల వద్ద లైన్‌లో నిలబడి మరీ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక అల్లు అర్జున్, జగపతి బాబు, రానా, లక్ష్మి మంచు, కీరవాణి ఫ్యామిలీ, నితిన్, రామ్, రాజమౌళి ఫ్యామిలీ ఇలా అందరూ ఓటు వేశారు.

Advertisement
CJ Advs

అయితే ఈ రోజు ఉదయం ఓటు వేయడానికి వెళ్లిన దర్శకుడు రాఘవేంద్ర రావు.. క్యూ లైన్ పాటించకుండా ఓటు వెయ్యడానికి వెళుతుంటే క్యూ లో ఉన్న ఓటర్లు అడ్డుకున్నారని... దానికి రాఘవేంద్ర రావు అవమానంగా భావించి ఓటు వేయకుండానే అలిగి వెళ్లిపోయారంటూ పెద్ద ఎత్తున ఛానల్స్‌లోను, సోషల్, వెబ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. విజయ నిర్మల, కృష్ణ వంటి పెద్ద వయసున్న వారే క్యూ లైన్ లో నిలబడి ఓటు వేస్తే.. రాఘవేంద్ర రావు మాత్రం లైన్ పాటించకుండా అలిగారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే తనపై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని... క్యూ లైన్‌లో నిలబడకుండా నేను అలిగి వెళ్లిపోయాననే వార్తల్లో వాస్తవం లేదని రాఘవేంద్రరావు స్వయంగా ప్రకటించారు. ‘‘ఆ వార్తలు నిజం కాదు. నేను ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది. ఆ లైన్ పూర్తయ్యేసరికి చాలా టైమ్ పడుతుంది. అయితే నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో అక్కడినుండి వెళ్లిపోయాను. క్యూ లైన్లో ఉన్న ఓటర్లు ఎవరూ నన్ను అభ్యంతరపెట్టలేదు. నేను బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి వెళ్లిపోయేంత కుసంస్కారం కలిగిన వ్యక్తిని కాను. ఇదిగోండి నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను. మీరే చూడండి. మీడియా వారు వార్త వేసేముందు.. దయచేసి మమ్మల్ని కూడా సంప్రదించి వేయండి..’’ అంటూ కాస్త అసహనంను వ్యక్తం చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.

Raghavendra Rao gives Clarity on his Vote:

Raghavendra Rao Denies Rumours on him
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs