Advertisement
Google Ads BL

కాజల్ వర్సెస్ మెహ్రీన్.. ఏం జరిగింది?


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ - మెహ్రీన్ కౌర్ నటించిన కవచం సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్స్‌పై కాజల్, మెహ్రీన్ హాట్‌హాట్‌గా దర్శనమివ్వడం, ఈ సినిమాకి సంబంధించిన ఓ వేదికపై కెమెరామెన్.. కాజల్‌కు ముద్దు పెట్టడం వంటి విషయాలతో ఈ చిత్రం కావాల్సినంత పబ్లిసిటీనైతే పొందింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు నటించిన సినిమాల్ని యావరేజ్ హిట్స్ కాబట్టి.. హీరో పరంగా కాకపోయినా.. ఈ సినిమా వార్తల్లో ఉండడానికి కారణం మాత్రం కాజలే అని చెప్పుకోవచ్చు. అయితే కవచం టీజర్ లాంచ్‌లో ఎంతో సరదాగా పాల్గొన్న మెహ్రీన్‌కౌర్‌కి, కాజల్‌కి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా.. మొన్నామధ్యన అంటే గత వారం జరిగిన కవచం ఆడియో వేడుకలో ఒక రూమర్ వినబడింది. ఎందుకంటే ఆ ఆడియో వేడుకలో కాజల్ పాల్గొంది కానీ.. మెహ్రీన్ డుమ్మా కొట్టింది.

Advertisement
CJ Advs

ఇక ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయనడానికి.... కాజల్, మెహ్రీన్ లు కలిసి కవచం ప్రమోషన్స్‌లో పాల్గొనకుండా సోలోగా ఇంటర్వూస్‌లో పాల్గొనడం, బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి ఒకసారి కాజల్, మరోసారి మెహ్రీన్‌లు టివీ ఛానల్స్‌లో ఇంటర్వూస్ ఇవ్వడం వంటివి అనుమానాలకు బలం చేకూర్చాయి. అనుమానం లేదు.. మెహ్రీన్‌కి, కాజల్ కి మధ్యన నిజంగానే కోల్డ్ వార్ నడుస్తుంది అని అంటున్నారు. అది కూడా కవచం షూటింగ్ టైం లోనే ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చినట్లుగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు వీరిద్దరి మధ్యన కవచం సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరిగినప్పుడు విభేదాలు వచ్చాయని.. దుబాయ్‌లో కవచం సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అప్పుడు హీరోయిన్ మెహ్రీన్‌తో కలిసి కాజల్ దుబాయ్ వెళ్ళడానికి నిరాకరించిందట.

అయితే చివరికి కవచం ప్రొడ్యూసర్స్ బ్రతిమాలితేనే కాజల్ దుబాయ్ కి మెహ్రీన్‌తో కలిసి వెళ్లిందట. అయితే అప్పటినుండి కాజల్ మీద మెహ్రీన్ గుర్రుగా ఉందంటున్నారు. తాజాగా వీరిద్దరూ.. మా ఇద్దరి మధ్య అసలు గొడవలు లేవని ఆ ఇద్దరి హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తున్నారు. తమ మధ్యన విభేదాలేం లేవని.. బయట వినబడేవన్నీ పుకార్లంటూ ఈ ఇద్దరి భామల ట్వీట్స్ చూస్తుంటే తెలుస్తుంది. మరి కాజల్, మెహ్రీన్‌లు తమ మధ్య ఏం లేదని అభిమానులకు చెబుతున్నా... ఇద్దరి మధ్యన నిజంగానే ఏదో జరగబట్టే ఇలాంటి క్లారిటీలంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.

War between Kavacham Heroines:

Interesting Fight between Kajal and Mehreen
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs