Advertisement
Google Ads BL

జూనియర్ ఎన్టీఆర్ నాకూ కొడుకే: బాలయ్య


>>>>మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్ పల్లి నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న టీడీపీ నేత నందమూరి సుహాసిని తరుపున నందమూరి కుటుంబం నుండి పలువులు ప్రచారంలో పాల్గొన్నారు. నందమూరి తారక్ రత్న, నందమూరి జానకిరామ్ సతీమణి, బాలకృష్ణ తదితరులు రోడ్ షో లో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.

Advertisement
CJ Advs

>>>>జూనియర్ ఎన్టీఆర్ నా అన్న హరికృష్ణకే కొడుకు కాదు.. నాకూ కొడుకే: బాలకృష్ణ!

>>>>బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేయవలిసి వచ్చింది అనే అంశాన్ని వివరిస్తూ.. ‘‘జీవితంలో రాజకీయాలు వేరు, సినిమాలు వేరు ఈ విషయాన్ని నేను మా నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి వద్ద నుండి నేర్చుకున్నాను. ఇక కూకట్ పల్లి నుండి పోటీకి దిగిన సుహాసిని తరుపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రావలసిన అవసరం లేదు.

>>>>ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తే కొంతమంది వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్నికల ప్రచారం అంతగా కలిసిరాలేదు. ఆ భయంతోనే నేను జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి రావద్దు అన్నాను. జూనియర్ ఎన్టీఆర్ నా అన్న హరికృష్ణ కొడుకే కాదు. నాకూ కొడుకే. అందుకే ఎన్నికల ప్రచారానికి రానివ్వలేదు. నా కొడుకు మోక్షజ్ఞ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రాలేదో.. జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకే రాలేదు.

>>>>నేను ఇప్పటికే ఎమ్మెల్యే గా ఉన్నాను. సినిమా పరిశ్రమలో స్టార్ డమ్ మొత్తం చూసేశాను. అందుకే రాజకీయాలు, సినిమాలు రెండూ బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. రాజకీయాలలో సుహాసినిది నాది ఒక్కటే మార్గం. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞది ఒకటే మార్గం అందుకే మేము వేరు, వాళ్ళు వేరు..’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి గురించి బాలకృష్ణ చాలా వివరంగా చెప్పుకొచ్చారు.

>>>>కాగా బాలకృష్ణ మాటలు విన్న నందమూరి అభిమానులు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ గురించి అతను పరిస్థితి గురించి బాబాయ్ బాలకృష్ణ చాలా గొప్పగా చెప్పుకు వచ్చారు అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Jr NTR is my son.. says Balayya:

Balayya gives Clarity on why Jr NTR Didnot attend Campaign
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs