Advertisement
Google Ads BL

ఎలక్షన్స్ రోజు సినిమాల పరిస్థితి ఇది!


రేపు తెలంగాణాలో ఒకవైపు ఎలక్షన్స్ హడావిడి, మరోవైపు సినిమాల విడుదల హడావిడి. ఒకపక్క ఓటు హక్కు వినియోగించుకోమని స్టార్ క్యాంపైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోమని స్టార్స్ కోరుతున్నారు. మరోవైవు విడుదల సినిమాల హడావిడి. తమ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేందుకు ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ అంటూ హడావిడి చేస్తున్నారు. అయితే సినిమా విడుదల రోజున ఏ సినిమాకైనా ఓపెనింగ్స్ బావుంటేనే ఆ సినిమాకి కాస్తో కూస్తో కలెక్షన్స్ వస్తాయి. కానీ రేపు విడుదల కాబోతున్న మూడు నాలుగు సినిమాలకు ఓపెనింగ్స్ రావాలంటే కాస్త కష్టంగానే కనబడుతుంది.

Advertisement
CJ Advs

సుమంత్ సుబ్రమణ్యపురంతో రేపు శుక్రవారమే వస్తుంటే.... బెల్లంకొండ శ్రీనివాస్ కవచంతో వస్తున్నాడు. ఇక మరో టాప్ హీరోయిన్ తమన్నా నటించిన నెక్స్ట్ ఏంటి సినిమా కూడా రేపే విడుదల కాబోతుంది. గత వారం విడుదలైన 2.ఓ సినిమా హిట్ అయితే గనక ఇవి వెనక్కి వెళ్ళేవి. ఎందుకంటే రెండో వారంలోను 2.ఓ హడావుడితో తమ సినిమాలకు కలెక్షన్స్ రావని వెనక్కి వెళ్ళిపోయేవారు. కానీ 2.ఓ తెలుగు రాష్ట్రాల్లో చతికిల పడడంతో పొలోమంటూ సినిమాలన్నీ ఈ శుక్రవారం వచ్చేస్తున్నాయి. అయితే 2.ఓ కి భయపడకపోయిన.. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలకు ఈ సినిమాలు జడవాల్సిందే. ఎందుకంటే రేపు 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎన్నికల హడావిడిలో జనాలు పోలింగ్ బూత్స్ లోనే గడిపేస్తారు. ఇక థియేటర్ వైపువారు రారు.

ఇక కాస్తో కూస్తో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చినప్పటికీ... ఆ సినిమాలు బావుంటే.... హడావిడి ఉంటుంది. లేదంటే సినిమా చూసిన జనాలు సినిమా బాలేదని స్ప్రెడ్ చేశారా... మనోళ్ల పని అవుట్. అందుకే బుక్ మై షోస్ కూడా ప్రస్తుతం వెలవెల బోతున్నాయి. ఎలాగూ తెలంగాణాలో ఈ వీకెండ్ నుండి సోమవారం, ఎలక్షన్స్ కౌంటింగ్ డే మంగళవారం కూడా పిల్లల స్కూల్స్ కి సెలవులిచ్చేశారు. కానీ ఆ సెలవలకి పెద్దలు ఎంజాయ్ చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ డే, కౌంటింగ్ డే రోజులు పెద్దలు రాజకీయాల మీదున్న ఇంట్రెస్ట్ తో టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. అందుకే రేపు విడుదల కాబోయే చిత్రాలు ఓపెనింగ్స్ బాగా దెబ్బపడేలా కనబడుతుంది.

What about Movies Situation on Elections day:

Telangana Elections: No interest on Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs