తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలే పడుతుంది. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమా అరవింద సమేత లో నటించినప్పటికీ.. ఈషా రెబ్బకి ఒరిగిందేమి లేదు. అయితే ఆ సినిమాలో ఈషా మరో హీరోయిన్ పూజ హెగ్డే కి చెల్లెలిగా నటించింది. ఇక ఎన్టీఆర్ తోనూ కేవలం మూడు నాలుగు సీన్స్ లో తప్ప మిగతా ఎక్కడా ఈషా రెబ్బ కేరెక్టర్ అరవింద సమేతలో కూరలో కర్వేపాకు మాదిరిగానే కనబడింది. చిన్నా చితక సినిమాల్లో హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంటున్న ఈషా రెబ్బ అలా అరవింద సమేత లో చిన్న కేరెక్టర్ ఎందుకు చేసింది చెప్మా అంటూ చాలామందే నోరు నొక్కుకున్నారు. అయితే అరవింద లో ఈషా సీన్స్ ని ఎడిటింగ్ లో లేపేసారనే టాక్ ఉంది.
తాజాగా ఈషా రెబ్బ నటించిన సుబ్రమణ్యపురం లో సుమంత్ కి జోడిగా నటించిన ఈషా రెబ్బ ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇంటర్వూస్ లో పాల్గొంటుంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా అరవింద సమేతలో తన రోల్ చిన్నదైనందుకు ఏమాత్రం హార్ట్ అవ్వలేదని చెబుతుంది ఈ చిన్నది. అరవింద సమేత లో చేసిన చిన్న పాత్ర మీ కెరీర్ కి ఏమన్నా ఉపయోగపడిందా అని అడగగా.. దానికి ఈషా రెబ్బ తెలివిగా సమాధానం చెబుతుంది. అరవింద లో తన రోల్ చిన్నదా పెద్దా అని ఆలోచించలేదని.. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల సినిమా అది. పైగా పెద్ద బ్యానర్ లో తెరకెక్కుతుంది కాబట్టి.... ఒప్పుకున్నా. నా కెరీర్‌కి ఆ సినిమా ఎంత ఉపయోగపడుతుంది అని కూడా ఆలోచించలేదు. అలాగే తన పాత్ర నిడివి తక్కువైనప్పటికీ.. తనకి పెద్దగా బాధ అనిపించలేదని.. ఎన్టీఆర్ కాబట్టి సినిమా చూస్తారు.. నా కోసం రారు కదా అంటూ సమాధానం చెబుతుంది ఈ హీరోయిన్. ఇక RRR లో అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందని అంటుంది ఈ భామ. మరి ఈషా రెబ్బ చెప్పినదానిబట్టి ఈషా కి సినిమాలో తన పాత్ర గురించిన బాధ లేదుకానీ.. ఆ సినిమాలో స్టార్ హీరో ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలన్నట్టుగా లేదు.