ఈ ఏడాది నందమూరి కళ్యాణ్ 'MLA' తో వచ్చి నిరాశపరిచాడు. ఈసినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే తన నెక్స్ట్ రెండు మూవీస్ ను లైన్ లో పెట్టాడు కళ్యాణ్ రామ్. ఒకటి కేవి గుహన్ దర్శకత్వంలో..ఇంకోటి 'సావిత్రి' ఫేం పవన్ సాధినేని దర్శకత్వంలో. కానీ కేవి గుహన్ మూవీ కు మాత్రం కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడు.
రెండు రోజులు కిందట ఈసినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. '118' అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈమూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. మరి పవన్ సాధినేనికి మాత్రం ఇంకా డేట్స్ ఇవ్వలేదట. కళ్యాణ్ తో సినిమా కోసం పవన్ ఏడాది నుండి వెయిట్ చేస్తున్నాడు. కథ విని ఓకే చేసాడు కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదు.
మరి పవన్ తో... కళ్యాణ్ సినిమా ఉంటుందా? అన్న అనుమానం వచ్చింది పవన్ కి. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం ఏమి చెప్పట్లేదని తెలుస్తుంది. పవన్ ఇంక వెయిట్ చేయలేక శ్రీ విష్ణు కి ఒక లైన్ చెప్పాడట. శ్రీ విషు కథ నచ్చడంతో త్వరలోనే సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. అలా కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్ళిపోయాడు పవన్.