ఫిదా చిత్రంలో క్లాస్ అమ్మాయిగా మాస్ వాయిస్ తో అలరించిన సాయి పల్లవి.. కణం సినిమాలో క్లాస్ గా ఆకట్టుకుంది. ఇక ఎంసీఏ లోను మిడిల్ క్లాస్ అమ్మాయిలా నటించిన సాయి పల్లవి... ఒకే ఏడాది ఒకే డేట్ లో ఒక క్లాసు కేరెక్టర్ ఒక మాసు కేరెక్టర్ చేసిన మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా ఒకే డేట్ కి అంటే ఆ మజా ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంతకీ సాయి పల్లవి ఈ క్లాసు మాసు గోలేమిటంటే... టాలీవుడ్ లో శర్వానంద్ తో కలిసి మెడికో గా క్లాస్ లుక్ లో పడి పడి లేచే మనసు లో నటిస్తుంది. ఈ సినిమా లోని పాటల్లో సాయి పల్లవి లుక్స్ సూపర్. ఇక ఈ పడి పడి లేచే మనసు చిత్రం డిసెంబర్ 21 న విడుదలకాబోతుంది.
అయితే సాయి పల్లవి మాస్ లుక్ లో నటించిన తమిళ మూవీ మారి 2 కూడా డిసెంబర్ 21 మీదే కన్నేసింది. ధనుష్ తో కలిసి ఊరమాస్ లుక్ లో నటించిన సాయి పల్లవి.. ఆ సినిమాలో ఆటో డ్రైవర్ గా మాసివ్ గా కనిపిస్తుంది. ఇక మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన మారి 2 మీదా.. మంచి అంచనాలే ఉన్నాయి. మరి మాస్ కేరెక్టర్, మాస్ లుక్స్ తో ఉన్న సాయి పల్లవి... ఆ మారి 2 తో ఇక్కడ టాలీవుడ్ క్లాస్ లుక్ లో ఉన్న పడి పడి లేచే మనసు సినిమాతో పోటీ పడుతుంది. కాకపోతే మారి తమిళ మూవీ ఆ సినిమా అక్కడ మాత్రమే విడుదలవుతుంది. ఇక డబ్బింగ్ చేసుకుని తెలుగులో దిగే సూచనలు కనిపించడం లేదు. మరి ఒకే రోజు ఒకే డేట్ కి తెలుగు సినిమాతోనూ, తమిళ సినిమాతోనూ సాయి పల్లవి ప్రేక్షకులను మాస్మరైజ్ చేయనుంది.