Advertisement
Google Ads BL

షాకింగ్: మహర్షి సెట్స్ నుంచి మహేష్ వాకౌట్


బహుశా మహేష్ బాబు కెరీర్ లో ఇప్పటివరకూ ఏ ఒక్క సినిమాకి కూడా "మహర్షి" సినిమాకి జరిగినంత హడావుడి కానీ.. ఈ సినిమా విషయంలో పుట్టుకొస్తున్నన్ని గాసిప్పులు కానీ రాలేదనుకుంటా. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఫిలిమ్ సిటీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న తాజా వార్త ఏమిటంటే.. "మహర్షి" సెట్స్ నుంచి మహేష్ బాబు వాకౌట్ చేశాడని. అది కూడా తన తోటి ఆర్టిస్టులందరూ సెట్ లో వెయిట్ చేస్తుండగా మహేష్ సెట్స్ నుంచి సైలెంట్ గా వెళ్లిపోయాడట. అది కూడా డైరెక్టర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా. 

Advertisement
CJ Advs

ఇంతకీ విషయం ఏంటంటే.. మహేష్ బాబు నడుచుకుంటూ వచ్చే ఓ సన్నివేశాన్ని అప్పటికే ఒక పడిసార్లు రీటేక్ చేసిన వంశీ పైడిపల్లి అలా ఒకటికి రెండుసార్లు రిపీట్ చేయడంతో.. మహేష్ బాబు సహనం కోల్పోయాడట. అప్పటికీ చాలా రీటేక్స్ వరకు ఓపిగ్గా ఉన్న మహేష్ రీటేక్స్ సంఖ్య పెరగడం తప్ప.. చాలా చిన్న సన్నివేశం అయిన ఆ షాట్ ఎంతకీ ఫైనల్ అవ్వకపోవడంతో కాసేపు బ్రేక్ అడిగిన మహేష్.. క్యారీ వ్యాన్ నుంచి సైలెంట్ గా వెళ్లిపోయాడట. ఆ తర్వాత మహేష్ వెళ్ళిన విషయం తెలుసుకున్న వంశీ పైడిపల్లి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్యాకప్ చెప్పాడని తెలుస్తోంది. 

మరి ఈ విషయంలో నిజమెంత, అబద్ధమెంత అనేది తెలియదు కానీ.. "మహర్షి" సినిమా కోసం వెయిట్ చేస్తున్న మహేష్ అభిమానులు మాత్రం కాస్త నీరసించే అవకాశం ఉంది. ఏప్రిల్ 2019లో విడుదలకానున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.  

Mahesh Walked Out of Maharshi Sets:

The Latest Tinsel Town Rumour is that Mahesh Babu walked out of Maharshi Sets as he was angry on Director Vamsi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs