Advertisement
Google Ads BL

క్రిష్ కారణంగా మెగాహీరో నష్టపోతాడా?


ఈనెల 21న వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'అంతరిక్షం' విడుదల అవ్వబోతుంది. 'ఘాజి' చిత్రంతో ఇండియా మొత్తం ఫేమస్ అయిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. మరో రెండు వారాల్లో ఈసినిమా రిలీజ్ అవుతుందని డేట్ ప్రకటించినా ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ లుక్ టీజర్...పోస్టర్స్...ఒక సాంగ్ తప్ప ఈసినిమా కు సంబంధించి ప్రమోషన్ తాలూకు సందడి కనిపించడం లేదు. ప్రమోషన్స్ లేట్ అవ్వడానికి ముఖ్య కారణం నిర్మాతల్లో ముఖ్యుడైన క్రిష్.

Advertisement
CJ Advs

క్రిష్ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈసినిమా వచ్చే నెల సంక్రాంతి కు రిలీజ్ అవ్వబోతుంది... కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు క్రిష్. అందుకే 'అంతరిక్షం' పై ఫోకస్ చేయలేకపోతున్నాడని సమాచారం. మరోవైపు అదే రోజు డిసెంబర్ 21న శర్వానంద్ - సాయి పల్లవిల 'పడి పడి లేచే మనసు' విడుదల అవుతుంది. ఈసినిమా 'అంతరిక్షం' కన్నా ముందు ఉంది. ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోయినా.. రిలీజైన ఆడియో ట్రాక్స్, పోస్టర్స్ అన్ని కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.

మరి 'అంతరిక్షం' ఇంకా హడావిడి ఎందుకు స్టార్ట్ చేయలేదో అర్ధం కావట్లేదు. క్రిష్ ఒక్క రోజు ఎన్టీఆర్ బయోపిక్ నుండి బయటికి వచ్చి ఈసినిమా ప్రమోషన్స్ కి అటెండ్ అయితే అంత సెట్ అవుతుంది అంటున్నారు. కానీ ఆలా చేయట్లేదు. 'పడి పడి లేచే మనసు' తో పోలిస్తే 'అంతరిక్షం' పై హోప్స్ తక్కువగా ఉన్నాయి. ఇలాంటి టైములో ప్రమోషన్స్ కరెక్ట్ గా చేస్తేనే వర్క్ అవుట్ అవుతుంది. లేకపోతే కష్టమే అంటున్నారు.

Will Mega Hero get Affected by Krish?:

Antariksham Movie Promotions Delayed by Krish
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs