Advertisement
Google Ads BL

మహేష్ ని ఇంప్రెస్స్ చెయ్యలేకపోతున్నాడంట!!


మహర్షి సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి మహేష్ తన నెక్స్ట్ మూవీ లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలు ఉండేటట్టు ప్లాన్ చేస్తా అని భరత్ అనే నేనుప్రమోషన్స్ టైములో చెప్పాడు మహేష్. ఆ మాట మీద కట్టుబడి మహర్షి షూటింగ్ కంప్లీట్ అవ్వకుండానే సుకుమార్ సినిమాను లైన్ పెట్టాలనుకుంటున్నాడు. సుకుమార్ తీసిన రంగస్థలం మహేష్ కు బాగా నచ్చడంతో తనతో సినిమా చేయాలనీ అనుకుని తనకు ఓ స్టోరీ చెప్పమని అన్నాడు మహేష్.

Advertisement
CJ Advs

సుకుమార్ రీసెంట్ గా మహేష్ దగ్గరకు వెళ్లి పీరియడిక్ స్టోరీ చెబితే మహేష్‌ రిస్క్‌ అని చెప్పి రిజెక్ట్‌ చేసాడని వార్తలొచ్చాయి. దాంతో సుకుమార్ కు ఏం చేయాలో అర్ధం కాక ఇంకో రెండు మూడు స్టోరీ లైన్స్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. జనవరిలో కథ చెప్పాలని, అంతకుమించి వేచి చూడలేనని మహేష్.. సుక్కు తో అన్నాడంటున్నారు. అందుకే సుకుమార్ తన టీం తో కలిసి లైన్‌ వర్క్‌ చేయడానికి బ్యాంకాక్‌ వెళ్ళాడట. 

అలానే మహేష్, కొరటాల శివ కలిసి మళ్లీ పని చేస్తాడనే వార్తలొస్తున్నాయి. ఒకవేళ సుకుమార్ మంచి కథ చెప్పకపోతే మహర్షి తరువాత మహేష్ కొరటాలతో చేసే అవకాశముంది. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. చిరు - కొరటాల సినిమా ఎట్ట లేదన్నా ఏడాది పడుతుంది. మరి అప్పుడువరకు మహేష్ ఆగుతాడా? కానీ మహేష్ సన్నిహితులు చెబుతున్న ప్రకారం మహేష్ నెక్స్ట్ సుకుమార్ తోనే చేస్తాడు అని అంటున్నారు. మరి సుకుమార్, మహేష్ ని ఇంప్రెస్స్ చేసే కథ ఏం చెప్తాడో చూడాలి.

He Not Impressing Mahesh:

Sukumar Not Impressing Mahesh Babu with his Stories
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs