Advertisement
Google Ads BL

బోయపాటి... తందానె తందానె, ఫ్యామిలీలు పడ్డట్లేనా?


బోయపాటి ఎంతగా క్లాస్ టైటిల్స్ పెట్టినప్పటికీ.. అటు తిరిగి ఇటు తిరిగి సినిమాలో మాస్ అండ్ యాక్షన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చాడనేది జయ జానకి నాయక లో అర్ధమైంది. తాజాగా రామ్ చరణ్ తో కూడా వినయ విధేయ రామ అంటూ టైటిల్ పెటాట్డు కానీ.. సినిమాలో ఊర మాస్ ఉందనేది వినయ విధేయరామ ఫస్ట్ లుక్ లోనే తేలిపోయింది. బోయపాటి ఎందుకు మారతాడు అంటూ... అందరూ రామ్ చరణ్ వినయ విధేయరామ కూడా పక్కా మాస్ మూవీ అని ఫిక్స్ అయ్యారు కూడా. అయితే బోయపాటి ఇపుడు వదులుతున్న లుక్స్ తో ప్రేక్షకులను పక్కదారి పట్టిస్తున్నాడనిపిస్తుంది. ఫస్ట్ లుక్ లోను, టీజర్ లోను రామ చరణ్ ని ఊర మాస్ గా చూపించిన బోయపాటి కార్తీక పౌర్ణమి రోజు రామ్ చరణ్ స్టైలిష్ అండ్ ట్రెడిషనల్ లుక్ ని వదిలాడు.

Advertisement
CJ Advs

అలాగే తాజాగా రామ్ చరణ్ క్లాసీ లుక్ లో అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న పిక్ ఒకటి.. ఇక నేడు సోమవారం ఫస్ట్ సింగిల్ పోస్టర్ తో సహా.. తాజాగా విడుదలైన తందానే.. తందానే అంటూ సాగే సాంగ్ ని కూడా రామ్ చరణ్ ఫ్యామిలీ అంటే.. అన్నా వదినలతో.. హీరోయిన్ కియారా అద్వానీ తో కలిసి మంచి ఫీల్ ఉండే సాంగ్ నే వదిలాడు. ఆ సాంగ్ మేకింగ్ మొత్తం ఫ్యామిలీ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా ఉంది. దీన్నిబట్టి బోయపాటి వినయ విధేయరామ తో క్లాస్ బిల్డప్ ఇస్తున్నాడనిపిస్తుంది. రామ్ చరణ్ కూల్ అండ్ స్టైలిష్ గా ఉన్న లుక్స్ తోనే ఫామిలీ ఆడియన్స్ ని అందరిని ఇంప్రెస్స్ చేసే ప్రయత్నాలు మొదలెట్టేసాడు.

మరి సాఫ్ట్ టైటిల్ తో మాస్ బిల్డప్ ఇచ్చిన బోయపాటిని మారలేదన్నారు. కానీ ఇప్పుడు వినయ విధేయరామ సాఫ్ట్ టైటిల్ కి తగ్గ లుక్స్ అండ్ సాంగ్ వదిలాడు. చూద్దాం బోయపాటి - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న వినయ విధేయరామలో ఎన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయో... అలాగే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అనేది ఆ సినిమా ట్రైలర్ వచ్చే వరకు ఆగితే సరిపోతుంది.

Boyapati Impressing Family Audience!!:

Thandaane Thandaane Song from Vinaya Vidheya Rama
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs