Advertisement
Google Ads BL

సుహాసినికి హ్యాండ్ ఇచ్చిన తమ్ముళ్లు!!


ప్రస్తుతం తెలంగాణాలో ఎక్కడ చూసినా పొలిటికల్ హీట్ కనబడుతుంది. డిసెంబర్ 7 న జరగబోయే తెలంగాణ ఎన్నికల కోసం పలు రాజకీయ పార్టీలు తమ తమ గెలు కోసం పాటుపడుతున్నాయి. తెలంగాణాలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆరెస్, తెలుగు దేశం, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు తమ గెలుపు కోసం భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు లతో హడావిడి చేస్తున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికలు ఒక ఎత్తు, తెలంగాణాలో కూకట్ పల్లి నియోజక వర్గం ఎన్నికలు ఒక ఎత్తు అన్నట్టుగా అంది వ్యవహారం. ఎందుకంటే తెలంగాణ లో నందమూరి వారు పోటీ చేసి చాలా ఏళ్ళు అయ్యింది. తాజాగా కూకట్ పల్లి నియోజక వర్గానికి లేట్ హరికృష్ణ కూతురు సుహాసిని రంగంలోకి దిగింది. అయితే సుహాసినిపొలిటికల్ గా చాలా వీక్. మరలాంటప్పుడు ఆమెని ఆమె తమ్ముళ్లు, మావయ్య, బాబాయ్ లు నిలబెట్టలి.

Advertisement
CJ Advs

అయితే మామ, ఏపీ సీఎం చంద్రబాబు సుహాసిని మద్దతుగా రోడ్ షో చేసాడు. ఇక బాబాయ్ బాలయ్య కూడా తాజాగా సుహాసిని మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. నామినేషన్ వేసేవరకు బాలకృష్ణ సుహాసిని వెన్నంటే ఉన్నాడు. ఇకపోతే సుహాసిని మద్దతుగా ఆమె తమ్ముళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ప్రచారానికి వస్తారని ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రతి రోజు నిరాశే ఎదురవుతుంది. అక్క ఎన్నికల బరిలోకి దిగినప్పుడు ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ లు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి అక్కకు మద్దతు తెలిపి చేతులు దులుపుకున్నారు. అప్పటినుండి అక్క సుహాసిని మద్దతుగా ఒక్క మాట కూడా తమ్ముళ్ల నోటి వెంట రాలేదు.

అసలు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ల మౌనం దేనికి సంకేతం. సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండి ప్రచారానికి రాలేదా? అక్క కోసం ఒక గంట ప్రచారం చేయలేరా? ఆమెకి తమ్ముళ్లుగా పుట్టి.. ఆ మాత్రం చేయలేరా? అసలెందుకు మౌనం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. మరి రేపు ఐదో తారీఖుతో ఈ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ లోపు ఎన్టీఆర్, కళ్యణ్ రామ్ లు ఏమైనా అక్కకు మద్దతుగా కదులుతారా...? అసలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఇలా ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు, బాలయ్య మాత్రం తమకెలాంటి సంబంధం లేదు మా పని మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మనస్సుల్లో ఏముందో కానీ.. ప్రస్తుతం నందమూరి అభిమానులైతే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ప్రచారానికి వస్తే బావుంటుందంటున్నారు.

NTR - Kalyan Ram gives shock to sister Suhasini:

Jr NTR - Kalyan ram Skips Kukatpally Election Campaign
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs