ప్రస్తుతం సమంతకు ఉన్న హిట్ స్టేటస్ మరియు ఫ్యామిలీ స్టేటస్ పరంగా చూసుకుంటే.. ఆమెను తెలుగు, తమిళ భాషల్లో బాలీవుడ్ హీరోయిన్స్ కూడా రీప్లేస్ చేయడం అనేది అనితరసాధ్యం. అలాంటిది "స్పైడర్" లాంటి డిజాస్టర్ తర్వాత తెలుగులో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా షూటింగ్ మొదలెట్టని రకుల్ ప్రీత్ సింగ్ కి సమంతను రీప్లేస్ చేసే అవకాశం ఎలా వచ్చిందబ్బా అని తెగ ఆలోచించేస్తున్నారా..?. రీప్లేస్ చేయడం వరకూ కరెక్టే కానీ.. అది సినిమా కాదండోయ్. అలా అనుకుని కంగారుపడిపోయి ఏ సినిమా? అని ఆలోచించేసి ఉంటే మీరు తప్పులో కాలేసినట్లే.
విషయం ఏంటంటే.. మజా అనే శీతల పానీయానికి నిన్నమొన్నటివరకు సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేది. ఆమె యాడ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. నిన్నట్నుంచి మాత్రం కొత్త మజా యాడ్ లో రకుల్ ప్రీత్ దర్శనమిస్తోంది. తొలుత ఈ యాడ్ చూసి ఏదో కొత్త డ్రింక్ యాడ్ అనుకున్నవాళ్ళందరూ, మజా యాడ్ అనే తెలిసేసరికి, అదేంటి సమంత ప్లేస్ లో రకుల్ ని ఎలా తీసుకొన్నారు అని కలవరపడుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. మొన్నటివరకూ రకుల్ ప్రచారకర్తగా వ్యవహరించిన బిగ్ సి బ్రాండ్ మొబైల్స్ కు ప్రస్తుతం సమంత బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది. సొ, ఇద్దరికీ అలా చెల్లుకు చెల్లు అయిపోయిందన్నమాట.