మేకపోతు గాంభీర్యం అనే పదాన్ని తెలుగు పాఠ్యాంశ పుస్తకాల్లో చదివే ఉంటాం కానీ.. ప్రెజంట్ జనరేషన్ లో చాలామందికి ఆ పదానికి సరైన అర్ధం తెలియదు. వాళ్ళందరూ ఒకసారి వర్మ ట్విట్టర్ లో గత వారం రోజులుగా పెడుతున్న ట్వీట్స్ చూస్తే.. మేకపోతు గాంభీర్యం అసలు మీనింగ్ అర్ధమైపోతుంది. ఇప్పుడు వర్మని ఆడిపోసుకోవడానికి కారణం ఏంట్రా అనుకుంటున్నారా. కారణం మరెవరో కాదు.. స్వయానా ఆయనే, ఆయన చేసే ట్వీట్లు, మాట్లాడే మాటలే ఇప్పుడు ఆయన్ను భయస్తుడు అనడానికి కారణం. మూడు వారాల క్రితమే విడుదలకు సిద్ధంగా ఉన్న తన సమర్పణలో రూపొందిన తాజా చిత్రం భైరవగీతను కావాలని 2.0కి పోటీగా రిలీజ్ చేద్దామనుకున్నాడు. కానీ.. రిజల్ట్ తాను ఎక్స్ పెక్ట్ చేసిన విధంగా రాకపోవడంతో ఇమ్మీడియట్ గా తన చిత్రాన్ని డిసెంబర్ 7కి పోస్ట్ పోన్ చేశాడు.
సరే డిసెంబర్ 7కి పోస్ట్ పోన్ చేసుకొన్నాడు బాగానే ఉంది అనుకుంటే.. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ నిన్న ఉన్నట్లుండి.. కన్నడలో డిసెంబర్ 7న విడుదలవుతున్న భైరవగీతను తెలుగులో మాత్రం స్క్రీన్స్ మరియు ఇతర సమస్యల కారణంగా డిసెంబర్ 14న విడుదల చేస్తున్నాను అంటూ ట్వీటాడు.
తన సినిమా మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లనే ఫస్ట్ కాపీ ఫైనల్ అవుట్ పుట్ రెడీగా ఉన్నప్పటికీ.. విడుదల విషయంలో ఇలా హంగామా చేస్తున్నాడని అందరికీ అర్ధమవుతోంది. అయితే.. ఈమధ్యకాలంలో వర్మ తన చిత్రాన్ని విడుదల చేసుకోవడం కోసం ఇలా ఇన్ని విధాలుగా తటపటాయించడం అనేది జరగలేదు. మరి ఈసారెందుకని వర్మ ఇలా భయపడుతున్నాడో ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరికీ అర్ధం కావడం లేదు.