ఆయన మరీ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో ఉన్న అగ్ర దర్శకుడు కాదు, అలాగని చిన్న డైరెక్టర్ కూడా కాదు. అగ్ర దర్శకుడికి, యువ దర్శకుడికి మధ్య ఉన్న గ్యాప్ లో డైరెక్టర్ కుర్చీ వేసుకొని కూర్చున్న వ్యక్తి. అయినా.. కమర్షియల్ ఎలిమెంట్స్ మీద, మాస్ ఎలివేషన్స్ మీద మనోడికి ఉన్న విపరీతమైన పట్టు, ప్రేమల కారణంగా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయనకి సినిమాల అవకాశాలు వస్తూనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఆయన తీసిన చిత్రాలు లెక్కించడానికి రెండో చేతి వేళ్ళ సహాయం కూడా అవసరం లేదు. అలాంటి స్టార్ డైరెక్టర్ తీస్తున్న తాజా చిత్రం ప్రొడక్షన్ కాస్ట్ మరియు షూటింగ్ డేస్ నిర్మాతలను దడ పుట్టిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సో కాల్డ్ స్టార్ డైరెక్టర్ ఓ అగ్ర కథానాయకుడిగాతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా నిరాటంకంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం ప్రొడక్షన్ కాస్ట్ మొదట్లో దర్శకనిర్మాతలు అనుకొన్నదానికి డబుల్ కాదు ఏకంగా ట్రిపుల్ అయ్యి కూర్చుంది. ఇప్పటికీ చిత్రీకరణ జరుపుకుంటూనే ఉన్న ఈ సినిమా పరిస్థితి ఎలా తయారయ్యిందంటే.. ఒక హిట్ అయినా పెట్టిన పెట్టుబడికి లాభాలు రావడం కష్టమని నిర్మాతలే ఫిక్స్ అయిపోయారు.
నిన్నమొన్నటివరకూ అవుట్ పుట్ బాగానే వస్తుండడంతో ఈ విషయాలను పెద్దగా పట్టించుకోని ఆ అగ్ర కథానాయకుడు కూడా ఈ స్టార్ డైరెక్టర్ పై నిప్పులు గక్కడం మొదలెట్టాడు. తనకి ఒక పెద్ద హిట్ అవసరమైన తరుణంలో ఈ డైరెక్టర్ ఇలా చేయడం మింగుడుపడడం లేదా హీరోకి. మరి ఈ ప్రొజెక్ట్ చివరికి ఏమవుతుందో చూడాలి.